గురుకుల విద్యార్థుల అమెరికా కల సాకారం

ABN , First Publish Date - 2022-08-04T20:06:23+05:30 IST

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థుల అమెరికా కల సాకారమైంది. ఇక్కడ ఇంటర్‌ చదివిన ముగ్గురు విద్యార్థులు.. అమెరికాలో డిగ్రీ చదివేందుకు

గురుకుల విద్యార్థుల అమెరికా కల సాకారం

హైదరాబాద్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థుల అమెరికా కల సాకారమైంది. ఇక్కడ ఇంటర్‌ చదివిన ముగ్గురు విద్యార్థులు.. అమెరికాలో డిగ్రీ చదివేందుకు ఎంపికయ్యారు. సాట్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి అమెరికాలోని అయోవా స్టేట్‌ యూనివర్సిటీలో సీట్లు సాధించారు. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో చదివిన లావణ్య, హారిక, స్వప్నిక ఈ ఘనత సాధించారు. ఎంపికైన విద్యార్ధులకు మంత్రి కొప్పుల ఈశ్వర్‌, సంస్థ కార్యదర్శి రోనాల్డ్‌ రోస్‌ అభినందనలు తెలిపారు. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో చదివే విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సాహం అందిస్తోందని ఈ సందర్భంగా రోస్‌ అన్నారు. గడిచిన ఏడు సంవత్సరాల్లో 20 మందికిపైగా విద్యార్ధులు విదేశాల్లో ఉన్నత చదువులకు వెళ్లడం అభినందనీయమన్నారు. 

Updated Date - 2022-08-04T20:06:23+05:30 IST