కడుతున్న పన్నుల మాటేమిటి?

ABN , First Publish Date - 2022-12-10T01:15:23+05:30 IST

గత మూడున్నర సంవత్సరాలలో రాష్ట్రంలో బీసీలకు రూ.1.63 లక్షల కోట్లు ఇచ్చామని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు.

కడుతున్న పన్నుల మాటేమిటి?

గత మూడున్నర సంవత్సరాలలో రాష్ట్రంలో బీసీలకు రూ.1.63 లక్షల కోట్లు ఇచ్చామని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. మరి ఈ కాలంలో వారు చెల్లించిన పన్నుల మాటేమిటి? నిజానికి పెరిగిన పన్నుల భారంతో వారి జీవనం దుర్భరంగా మారింది. ఉదాహరణకు మత్స్యకారులు డీజిల్ పై గత ప్రభుత్వ హయాంలో కంటే ఇప్పుడు 50 శాతం అధికంగా చెల్లిస్తున్నారు. అది కూడా పొరుగు రాష్ట్రాల కంటే అత్యధికంగా ఉంది. ఇలా ఏ వస్తువు ధర చూసినా గణనీయంగా పెరిగిపోయింది. గతంలో కంటే ఎక్కువ లబ్ధి పొందితే బీసీల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి కదా? వాస్తవానికి ప్రభుత్వ ఖర్చులో దుబారా బాగా పెరిగిపోయింది. ఆ భారం పరోక్షంగా పేదలపై పడుతోంది. బాధ్యతారాహిత్య పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

– జి.రామకృష్ణ

Updated Date - 2022-12-10T01:15:24+05:30 IST