నేడు ‘నేతాజీ’పై వెబినార్
ABN , First Publish Date - 2022-12-31T01:06:00+05:30 IST
భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు చిరస్మరణీయం.
భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు చిరస్మరణీయం. ఆయన 125వ జయంతిని సమున్నతంగా నిర్వహించడానికి జాతీయ స్థాయిలో ఒక సంస్మరణ కమిటీ గతంలో ఏర్పడింది. కొవిడ్, లాక్‌డౌన్ వంటి కారణాల వల్ల ఈ కార్యక్రమాలను పెద్దయెత్తున నిర్వహించడానికి వీలు కాలేదు. అందువల్ల ఈ సంస్మరణ కాల వ్యవధిని మరో సంవత్సరం పొడిగించాం. డిసెంబర్ 31, 2022న మధ్యాహ్నం మూడు గంటలకు ‘కర్టెన్ రైజర్’ పేరుతో ఒక వెబినార్ జరగనున్నది. జర్మనీలో ఉంటున్న నేతాజీ కుమార్తె డాక్టర్ అనితా బోస్ ఫాఫ్ ముఖ్య వ్యక్తగా ఈ వెబినార్ లో ప్రసంగిస్తారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి కమిటీ అఖిలభారత గౌరవాధ్యక్షులు, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ సౌమిత్రి బెనర్జీ అధ్యక్షత వహిస్తారు. మోడరేటర్‌గా బిశ్వబసు దాస్ వ్యవహరిస్తారు. ఈ కార్యక్రమాన్ని https: //youtu.be/v1sUyR4mTYU, https:// fb.me/e/2YD6hn35D లలో వీక్షించవచ్చు.
– పి. తేజ, కన్వీనర్
నేతాజీ 125వ జయంతి సంస్మరణ కమిటీ