వెలిసిన రంగులతో.. చిరిగిన వస్త్రం

ABN , First Publish Date - 2022-04-25T06:16:43+05:30 IST

పగిలిన గాజుముక్కల్లో ఎన్ని కథలు ఉన్నాయో తెలుసా? అక్కడ ఆగి అవి వినేవాళ్లు వున్నారా...

వెలిసిన రంగులతో.. చిరిగిన వస్త్రం

పగిలిన గాజుముక్కల్లో 

ఎన్ని కథలు ఉన్నాయో తెలుసా?

అక్కడ ఆగి అవి వినేవాళ్లు వున్నారా అనే గగురుపాటు


దిగులుగా కూర్చొని 

ఆకాశాన్ని చూస్తూ 

ఆలోచించే ఆ సమయమంతా చీకటి 


కొంచెం కొంచెం ఆ రాత్రిలో 

నలుగుతూ కదిలే కథంతా నిశ్శబ్దం 


కథలన్నీ వాక్యాలు వాక్యాలుగా 

విరుగుతూ ఒక అరుపు తెగిపడ్డాక 

పాసిన చద్దన్నంలో 

నీళ్ళూరుతున్న దృశ్యాన్ని చూసి

మరి ఇక ఒక పిచ్చివాని వోలే నవ్వుతావు 

జీవం లేకుండా..


ఇక గాయంచేసే ఆ నిర్దయ క్షణాలన్నిటిని 

రాయడం మొదలుపెడతావు 


ఇప్పుడు 

ఆ కథంతా 

వెలిసిన రంగులతో 

చిరిగిన వస్త్రం

లక్ష్మీ కందిమళ్ళ

89196 99815


Updated Date - 2022-04-25T06:16:43+05:30 IST