ప్రహ్లాద్ జోషీ చెప్పింది నిజమే

ABN , First Publish Date - 2022-03-05T07:05:55+05:30 IST

ఉక్రెయిన్ యుద్ధంలో కర్ణాటక విద్యార్థి నవీన్ మరణించడం బాధాకరం. తన కుమారుడికి ఇంటర్‌లో 97 శాతం మార్కులు వచ్చినా కర్ణాటకలో మెడికల్ సీటు రాలేదని నవీన్ తండ్రి శేఖరప్ప వాపోయారు. మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్ ‘నీట్’లో నవీన్‌కు వచ్చిన మార్కులు...

ప్రహ్లాద్ జోషీ చెప్పింది నిజమే

ఉక్రెయిన్ యుద్ధంలో కర్ణాటక విద్యార్థి నవీన్ మరణించడం బాధాకరం. తన కుమారుడికి ఇంటర్‌లో 97 శాతం మార్కులు వచ్చినా కర్ణాటకలో మెడికల్ సీటు రాలేదని నవీన్ తండ్రి శేఖరప్ప వాపోయారు. మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్ ‘నీట్’లో నవీన్‌కు వచ్చిన మార్కులు ఎన్నో ఆయన చెప్పి ఉంటే బాగుండేది. కుమారుడి విషాద మరణంతో తల్లడిల్లుతున్న ఆ తండ్రి బాధ సరైనదే కానీ, వైద్య విద్యపై చేసిన వ్యాఖ్యలు సమర్థనీయమైనవి కావు.


ఇక, విదేశాలలో వైద్య విద్యనభ్యసించివచ్చిన వారికి దేశంలో నిర్వహిస్తున్న పరీక్షలో 95 శాతం మంది ఉత్తీర్ణులు కాలేకపోతున్నారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యానించారు. అది పూర్తి నిజం. వాస్తవమేమిటంటే చైనా, ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్ మొదలైన దేశాలలో వైద్య విద్యా ప్రమాణాలు ఉత్కృష్టమైనవి కావు. ఇంకా చెప్పాలంటే తక్కువస్థాయివే. యాభై సంవత్సరాల క్రితం మేము అమెరికాలో ఇసిఎఫ్‌ఎమ్‌జి పరీక్షలో ఉత్తీర్ణులమై పిజి కోర్సులను విజయవంతంగా పూర్తి చేయగలిగాం. అమెరికాలోని వైద్య విద్య ప్రమాణాలతో పోల్చి చూస్తే భారత్, బ్రిటన్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా మరే దేశంలోనూ వైద్య విద్యా ప్రమాణాలు మెరుగైనవి కావనేది ఒక వాస్తవం.

 డాక్టర్ ప్రసాద్, ఎమ్‌డి

కేలిఫోర్నియా, అమెరికా

Updated Date - 2022-03-05T07:05:55+05:30 IST