జేఎనటీయూలో ప్రీ పీహెచడీ పరీక్షలు

ABN , First Publish Date - 2022-12-03T23:51:20+05:30 IST

జేఎనటీయూ ఆధ్వర్యంలో ప్రీ పీహెచడీ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. శనివారం వీసీ రంగజనార్దన పరీక్షా కేంద్రాన్ని సందర్శించి నిర్వహణ విధానాన్ని పరిశీలించారు.

జేఎనటీయూలో ప్రీ పీహెచడీ పరీక్షలు

అనంతపురం సెంట్రల్‌,

డిసెంబరు 3:

జేఎనటీయూ ఆధ్వర్యంలో ప్రీ పీహెచడీ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. శనివారం వీసీ రంగజనార్దన పరీక్షా కేంద్రాన్ని సందర్శించి నిర్వహణ విధానాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ప్రీ-పీహెచడీ విద్యార్థులకు ఏడాదిలో వింటర్‌, సమ్మర్‌ సెషనల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా శనివారం నుంచి వారం రోజులపాటు వింటర్‌ సెషన పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. పరీక్షలు రాస్తున్న విద్యార్థుల వందకుగాను కనీసం 50మార్కులు సాధించాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు కేశవరెడ్డి, సుమలత, వైస్‌ ప్రిన్సిపాల్‌ భవాని, అధికారులు చంద్రమోహనరెడ్డి, జితేంద్రగౌడ్‌, శ్రీనివాసులు, పీఆర్వో డాక్టర్‌ రామశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-03T23:51:20+05:30 IST

Read more