చరిత్రను పొదువుకొన్న కవిత్వం ‘థేరీగాథలు’
ABN , First Publish Date - 2022-10-17T07:50:26+05:30 IST
తొలితరం బౌద్ధ సన్యాసినుల కవిత్వం’ పుస్తక రచయిత బొల్లోజు బాబాతో అద్దేపల్లి ప్రభు ఇంటర్వ్యూ....
బొల్లోజు బాబా : పలకరింపు
‘థేరీగాథలు - తొలితరం బౌద్ధ సన్యాసినుల కవిత్వం’ అనే ఈ పుస్తక రచనలో మీ అనుభవాలు చెప్పండి?
మీకు గుర్తుందో లేదో చాన్నాళ్ళ క్రితం మీరు థేరీగాథలు చదివారా అని అడిగారు. అప్పటికి వాటిగురించి విన్నాను తప్ప చదవలేదు. నెట్లో వెతికితే వాడ్రేవు చినవీరభద్రుడు గారి బ్లాగులో థేరీ గాథలపై రాసిన అద్భుతమైన వ్యాసం కనిపించింది. మూలాల కోసం అన్వేషించాను. చాలానే కనిపించాయి. ఆనాటి స్త్రీలు, వారి జీవనం, చారిత్రిక నేపథ్యం చదువుతున్నప్పుడు గొప్ప అనుభూతికి లోనయ్యాను. దాని ఫలితమే నేడు మీ చేతిలో ఉన్న ఈ పుస్తకం.
తొలి తరం బౌద్ధ సన్యాసినులు తమ అనుభవాలకు ఇచ్చుకొన్న కవిత్వరూపమే థేరీ గాథలు. భిన్న సామాజిక నేపథ్యాల నుంచి వచ్చిన మొత్తం 73 మంది థేరీలు రాసుకొన్న 73 కవితలు ఇవి. మానవ దుఃఖం, వేదన, ముక్తికొరకు అన్వేషణ, తధాగతుని బోధనలలో దొరికిన సాంత్వన ఈ గాథల ప్రధాన ఇతివృత్తం. థేరీ గాథలు రెండున్నరవేలఏళ్ళ క్రితపు సమాజాన్ని స్త్రీ దృక్కోణం లోంచి మనకు చూపిస్తాయి.
ఈ పుస్తక రచనా సమయంలో నాకు బౌద్ధ పరిభాష విషయంలో వచ్చిన అనేక సందేహాలను, ఎంతో ఓర్పుతో పూజ్య బిక్ఖు ధమ్మరక్ఖిత గారు తీర్చారు. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాను.
మీరు మౌలికంగా కవి అని అనుకుంటాను. చరిత్ర పట్ల మీ ఉద్వేగం చరిత్ర అధ్యయనంలో కనిపిస్తుంది. థేరీ గాథలు మిమ్మల్ని ఆకర్షించడానికి కారణం కవిత్వమా? లేక చరిత్రా?
సాహిత్యంలో తొలిసారిగా నిక్షిప్తం చేయబడిన స్త్రీల హృదయ స్వరాలు ‘థేరీగాథలు’. రెండున్నరవేల సంవత్సరాల క్రితపు థేరీ గాథలలోని కవిత్వం నేటికీ మన హృదయాల్ని కంపింపచే స్తుంది. ఆ కారణంగానే కావొచ్చు వీటిని అనువదించే సమయంలో గొప్ప అనుకంప పొందాను. ఆ కవిత్వం ఇచ్చే అనుభూతి కన్నా చరిత్రపరంగా ఆ గాథలద్వారా లభించే ఆనాటి సమాజం గురిం చిన సమాచారం మరింత విలువైనది అనుకొంటాను. ఇది వస్తు వులకో సాహిత్యానికో ఉండే యాంటిక్ వాల్యూ లాంటిది కాదు. ఫెమినిజం విషయమై- స్త్రీ పురుషులిద్దరూ సమానమేనని, పురు షాధిక్య పీడనను ఒదిలించుకోవటానికి ఒంటరిగానైనా జీవించ వచ్చునని అప్పట్లోనే అంతటి పురోగమన భావాలను వ్యక్తం చేసిన మన సమాజం వాటన్నిటినీ కోల్పోయి ఇరవయ్యో శతా బ్దంలో పాశ్చాత్య సమాజాలనుండి ఫెమినిజం పాఠాలు నేర్చుకో వాల్సిన పరిస్థితి రావటంలోని చారిత్రిక పరిణామంపై ఆసక్తి అది.
నీ నేత్రాలు అందంగా ఉన్నాయంటూ, తనను ప్రేమిస్తున్నానని వేధించే యువకునికి తన కనుగుడ్డును పెరకి, నువ్వు ఇష్టపడే కన్ను ఇదిగో, ఇది శ్లేష్మం నిండిన గోళం అని చెప్పిన శుభ గొప్ప ప్రతీకతో, స్త్రీ దేహం సుఖాలకు నెలవు కాదు, స్త్రీ ఒక భోగవస్తువు కాదు అనే విషయాన్ని నిర్ద్వద్వంగా ప్రకటించింది.
నేను స్వేచ్ఛనొందాను, మూడు కుటిల విషయాలనుండి: భర్త, రోలు, రోకలి -- అంటూ ముత్త తన స్వేచ్ఛను, తన దేహంపై హక్కులను, తన శ్రమ విలువను తనకు తానే నిర్వచించుకొంటుంది. ఇలాంటి స్పష్టత కొరకు ఆధునిక మహిళ ఇంకా పోరాడుతూనే ఉంది.
దుఃఖం అనే మాట బౌద్ధంతో విడదీయరాని పదం. థేరీ గాథలలో స్త్రీల దుఃఖపు గాథల్ని ఎలా అర్థం చేసుకోవచ్చు?
ఈ గాథలు చాలామట్టుకు దుఃఖాన్ని నేపథ్యంగా కలిగిన స్త్రీలు చెప్పుకొన్న అనుభవాలు. భర్తను మరో స్త్రీతో పంచుకోవటం, పుట్టిన సంతానం చనిపోవటం, కాపురంలో భర్త పెట్టే హింస, ప్రాణాలు తోడేసే కాన్పులు, సంసారంలో గొడ్డు చాకిరీ, భర్త చనిపోవటం లేదా వదిలేసిపోవటం, వార్థక్యంలో పిల్లలు ఆస్తి లాక్కొని ఇంట్లోంచి గెంటేయటం లాంటి అనేక స్త్రీల దుఃఖాలు ఈ గాథలనిండా పరచుకొని ఉన్నాయి. ‘‘స్త్రీగా ఉండటమే ఒక దుఃఖం’’ అంటుంది కిసగౌతమి అంతిమంగా.
తాము సన్యసించటానికి ప్రధాన కారణాలు, దుఃఖ మూలాల అన్వేషణ, దుఃఖ నివారణ, దుఃఖం నుండి విమోచన చెందటం అని ఈ స్త్రీలు చాలా గాథలలో చెప్పుకొన్నారు. రాగ ద్వేష మోహాలను అధిగమించిన స్థితి అయిన నిబ్బాణను సాధించటం జీవితాశయంగా భావించారు. ‘‘నా హృదయంలో దిగిన దుఃఖమనే అదృశ్యబాణాన్ని తథాగతుడు తీసివేసాడు’’ అని అనేక మంది థేరీలు ప్రకటించుకొన్నారు. తమ దుఃఖం బుద్ధుని బోధనల వల్ల తొలగిపోయిందని తొలితరం బౌద్ధ సన్యాసినులు చెప్పిన సాక్ష్యమే ఈ గాథలు.
భారతీయ సాహిత్యం మీద థేరీ గాథల ప్రభావం కొనసాగిందని భావించ వచ్చా?
గాథాసప్తశతి, హరివిజయ, సేతుబంధ, గౌదావహొ, లీలావాయి, వజ్జాలగ్గలాంటి ప్రాకృత రచనల నుండి సుమారు 3000వరకూ అందమైన పద్యాలను వివిధ సంస్కృత అలంకార గ్రంథాలలోకి ఉదాహరణలుగా, ఇతర సంస్కృత కావ్యాలలో వర్ణనలుగా, తీసు కొన్నట్లు గ.క. ఓఠజూజ్చుటుఽజీ పరిశోధన చేసి తెలిపారు. థేరీ గాథలు కూడా అదే కోవకు చెందిన ప్రాకృత (పాలీ) రచన. కానీ థేరీ గాథలనుండి ఏ రకమైన భావాల సంగ్రహణ జరగకపోవటాన్ని బట్టి ప్రధాన స్రవంతి సాహిత్యం థేరీగాథలను పూర్తిగా విస్మ రించిందనే భావించాలి. దీనికి కారణం కారణం భాష కాక భావ జాలం అని అనుకోవచ్చు.
థేరీగాథలను ఒక సాహిత్య నెరేటివ్గా భావిస్తే-- విద్య, స్వేచ్ఛ, ఆధ్యాత్మిక సాధనలకు స్త్రీలు అర్హులని ప్రభోదించాయి. థేరీగాథల తదుపరి వచ్చిన భారతీయ సాహిత్యం స్త్రీ పురుషులు ఇరువురూ సమానమనే భావనకు దూరం జరిగి పాతివ్రత్యం, న స్త్రీ స్వాతంత్య్ర మర్హతి అనే భావజాలంలోకి జారిపోవటం గమనార్హం.
గాథాసప్తశతి, గౌడవహా, వజ్జలగ్గ, థేరీ గాథలు, ప్రాచీన భారతీయసాహిత్యంలో ఇవి ప్రధాన స్రవంతిగా కాక ఒక పాయగా వుండినాయనిపిస్తుంది. మీ అభిప్రాయం?
చెప్పలేం. ఇవి బౌద్ధ, జైన మతాలతో సంబంధం ఉన్న ప్రాకృత రచనలు. ఎప్పుడైతే సంస్కృతం పండితభాషగా స్థిర పడిందో అప్పటినుంచి ప్రాకృత రచనలకు బదులు సంస్కృత కావ్యాలు రావటం మొదలైంది. ప్రాకృతభాష ఉత్థానపతనాలు ప్రాచీన భారతదేశ మతచరిత్రతో ముడిపడి ఉండటం ఆసక్తి కరం. సాశ.4వ శతాబ్దం నుండి సంస్కృతం భరతఖంఢంలో నలుమూలలకు విస్తరించ సాగింది. అంతవరకూ క్రతువులకు, మతసంబంధరచనలకు పరిమితమై ఉన్న సంస్కృతం ఒక్క సారిగా రాజాశ్రయం పొంది రాజకీయభాషగా, సాహిత్యభాషగా మారటం దక్షిణ ఆసియా చరిత్రలో కీలక రాజకీయ, సామాజిక పరిణామంగా ఖీజ్ఛి ఔ్చుఽజఠ్చజ్ఛ ౌజ ఎౌఛీట అనే పుస్తకంలో ఖిజ్ఛిజూఛీౌుఽ ్కౌజూజూౌఛిజు అభిప్రాయపడ్డాడు. ఈ వెల్లువలో అంత వరకూ ప్రధాన స్రవంతిగా ఉన్న ప్రాకృత రచనలు కొట్టుకు పోయి ఉండవచ్చ్చు.
నేడు తాళపత్ర గ్రంథాలను డిజిటైజ్ చేస్తున్నట్లుగానే ఆనాటికి ఉన్న ప్రాకృత రచనలలో మతప్రసక్తి లేని అంశాలను కొందరు పండితులు సంస్కృతభాషలోకి ఏదో మార్గం ద్వారా తీసుకొచ్చినట్లు పైన చెప్పిన గ.క. ఓఠజూజ్చుటుఽజీ పరిశోధన ధృవపరుస్తుంది.
98493 20443
