ఆదర్శవంతమైన ఆచరణాత్మక విధానాలు

ABN , First Publish Date - 2022-01-13T09:07:30+05:30 IST

‘సహకార’ పథంలో ఆర్థిక సాధికారత శీర్షికన జనవరి 6న ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన చెన్నమనేని రమేష్ లోతైన విశ్లేషణాత్మక వ్యాసం చదివాను. ‘ఆర్థిక సాధికారికతకు, ఆర్థిక స్వావలంబనకు సహకార పథం’ ఆవశ్యకత గురించి...

ఆదర్శవంతమైన ఆచరణాత్మక విధానాలు

‘సహకార’ పథంలో ఆర్థిక సాధికారత శీర్షికన జనవరి 6న ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన చెన్నమనేని రమేష్ లోతైన విశ్లేషణాత్మక వ్యాసం చదివాను. ‘ఆర్థిక సాధికారికతకు, ఆర్థిక స్వావలంబనకు సహకార పథం’ ఆవశ్యకత గురించి వ్యాసకర్త సూచించిన ఆదర్శవంతమైన ఆచరణాత్మక విధానాలు ప్రస్తుత వ్యవస్థలకు మార్గదర్శకాలు. వర్తమాన వ్యావసాయిక సంక్షోభాన్ని అధిగమించడానికి దేశంలో ఇటువంటి సహకార నమూనాలు ఎంతైనా ఉపయోగకరం. రోజురోజుకీ దిగజారిపోతున్న ఆత్మవిశ్వాసం రైతు చిరునామాగా మారి ఎవుసం అంటే ‘నక్కీదువ్వ’ ఆటగా మారిపోతున్న దుస్థితి నెలకొంటున్నది. క్రమంగా పెట్టుబడి పడగ నీడలోకి ఎవుసాన్ని లాగే కుట్రలు కుయుక్తులు పాలకవర్గాలు నిరంతరం పన్నుతూనే ఉన్నాయి. పైకి వెనక్కి తీసుకుంటున్న చట్టాల విషం శాసనకర్తల మెదళ్ళలో అలాగే నిండి ఉంది. అది రేపు మరొక రూపంలో మొత్తం వ్యవసాయ రంగాన్ని కబళించడానికి సంసిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాసం వ్యవస్థలకు ఉపయుక్తకర నమూనాలను చాలా చక్కగా సూచించింది. కీర్తిశేషులు సిహెచ్ రాజేశ్వరరావు (వ్యాసకర్త తండ్రి) ఆలోచనల నుండి ఆవిర్భవించి, ప్రస్తుత కాలంలో విజయవంతంగా నడుస్తున్న CESS, వ్యాసకర్త చొరవ, ఆసక్తితో ఎన్నో ఫలితాలు సాధించిన SAVES వ్యాసకర్త ఆలోచనల ప్రతిరూపాలే. ఆచరణాత్మక సహకార నమూనాల చింతనలో, వాటి ఆచరణలో చక్కని అనుభవం ఉన్న ఔత్సాహిక శాసనసభ్యుడుగా చెన్నమనేని రమేష్‌కు అభినందనలు.

వఝల శివకుమార్

Read more