నిరుద్యోగుల వయోపరిమితి పెంచాలి

ABN , First Publish Date - 2022-01-18T07:40:26+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 కు పొడిగించడం వల్ల ప్రభుత్వ ఉద్యోగంపై ఆశలు పెట్టుకున్న వారు...

నిరుద్యోగుల వయోపరిమితి పెంచాలి

రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 కు పొడిగించడం వల్ల ప్రభుత్వ ఉద్యోగంపై ఆశలు పెట్టుకున్న వారు నిరాశ చెందుతున్నారు. ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించి ప్రస్తుతం ఉన్న అభ్యర్థుల వయోపరిమితిని ఐదేళ్లు పొడిగించాలి. అసలే ప్రతి ఏటా రావాల్సిన జాబ్ క్యాలెండర్ లేక నిరుద్యోగులు ఇబ్బంది పడుతుంటే, పదవీ విరమణ కాలాన్ని పొడిగించి మరింత ఆవేదనకు గురయ్యేలా చేయడం సబబు కాదు. వెంటనే ప్రభుత్వ శాఖల్లో ఉన్న అన్ని ఖాళీలను భర్తీ చేయడంతో పాటు వయోపరిమితి పెంచి న్యాయం చేయాలి.

పద్మనాభుని మణిదీప్, ఊటుకూరు

Read more