కాటేస్తున్న కల్తీ మద్యం
ABN , First Publish Date - 2022-03-19T06:08:29+05:30 IST
రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ, నాసిరకం మద్యం సేవించి ఎంతోమంది పేద ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. పాలకులు అంచెలంచెలుగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పారు. అయితే ఆచరణలో మద్యం....

రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ, నాసిరకం మద్యం సేవించి ఎంతోమంది పేద ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. పాలకులు అంచెలంచెలుగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పారు. అయితే ఆచరణలో మద్యం అమ్మకాలను పెంచి ఆదాయం పొందాలని చూస్తున్నారు. ఈ క్రమంలో అసలు ప్రభుత్వం సరఫరా చేస్తున్న మద్యం నాణ్యతా ప్రమాణాలపై తనిఖీలు కనీసం నామమాత్రంగా కూడా జరగడం లేదు. తయారీదారు నుంచి వినియోగదారునికి చేరేసరికి చాలా చేతులు మారుతాయి. కల్తీ ఎక్కడైనా జరిగే అవకాశం లేకపోలేదు. అలాగే, ప్రభుత్వం మద్యం అమ్మకాలను ఆదాయ వనరుగా చూడకుండా కేవలం బ్రాండెడ్ మద్యాన్ని పరిమితంగా విక్రయిస్తే పేదల ప్రాణాలు నిలుస్తాయి!
– గరిమెళ్ళ రామకృష్ణ
ఏలూరు