పగటి మోసం
ABN , First Publish Date - 2022-10-17T07:35:02+05:30 IST
పల్లె చూర్లకు విషం పూసిన డబ్బు కట్టల్ని వ్రేలాడతీసి జేబుల్ని తలుపుకొట్టే పగటి మోసం కడుపులో కోరికను కలియతిప్పి...
పల్లె చూర్లకు
విషం పూసిన డబ్బు కట్టల్ని
వ్రేలాడతీసి
జేబుల్ని తలుపుకొట్టే
పగటి మోసం
కడుపులో కోరికను
కలియతిప్పి
ఒళ్ళు మరిచి
నోట కరుచుకున్న పిచ్చి
వేలుని కోసిచ్చి
హక్కును అమ్ముకుంది.
ముళ్ళు కలిపిన మెతుకులను
నోటికందించే మలినమైన ప్రేమకి
కమిలిన విలువలతో
గుటకలు వేసే నేటి సంతోషమే
రేపటి స్మశానానికి
బతుకుల్ని పునాదులగా చేసి
కన్నీటిని రంగులుగా పులిమే విషాదమే
నేటి రాజకీయం.
శ్రీ సాహితి, 9704437247