దాశరథి జయంత్యుత్సవాలు

ABN , First Publish Date - 2022-07-22T07:12:40+05:30 IST

డా. దాశరథి కృష్ణమాచార్య 98వ జయంతి ఉత్సవాలు, సాహితీ పురస్కార ప్రదానోత్సవం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నేడు...

దాశరథి జయంత్యుత్సవాలు

డా. దాశరథి కృష్ణమాచార్య 98వ జయంతి ఉత్సవాలు, సాహితీ పురస్కార ప్రదానోత్సవం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నేడు జరగనున్నాయి. సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి జ్యోతి ప్రకాశనం చేస్తారు. సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ సభకు అధ్యక్షత వహిస్తారు. ప్రముఖ కవి వేణు సంకోజుకు పురస్కార ప్రదానం జరుగుతుంది. గద్వాల విజయలక్ష్మి ప్రత్యేక అతిథి. గుత్తా సుఖేందర్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి విశిష్ట అతిథులు. మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస యాదవ్, ఎం.ఎస్ ప్రభాకర్ రావు, కె.వి. రమణాచారి, రసమయి బాలకిషన్, దానం నాగేందర్, జూలూరు గౌరీశంకర్, మోతె శ్రీలత శోభన్ రెడ్డి, విజయా రెడ్డి గౌరవ అతిథులు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.

Read more