పూల బొకే కన్నా పూల మొక్క మిన్న

ABN , First Publish Date - 2022-12-31T00:54:22+05:30 IST

ఒక ఫంక్షన్ గ్రాండ్‌గా జరిగింది, పూర్తయి పది నిమిషాలు అయింది. ముఖ్య అతిథులతో పాటు హాజరైన వారందరూ వెళ్ళిపోయారు.

పూల బొకే కన్నా పూల మొక్క మిన్న

ఒక ఫంక్షన్ గ్రాండ్‌గా జరిగింది, పూర్తయి పది నిమిషాలు అయింది. ముఖ్య అతిథులతో పాటు హాజరైన వారందరూ వెళ్ళిపోయారు. స్టేజ్ వెనుకనే వందలాది రూపాయలు పెట్టి కొన్న పూలదండలు/బొకేలు నిర్జీవంగా పడివున్నాయి. బొకేల జీవితం అది కట్టినంత సేపు ఉండదు. నూతన సంవత్సర వేడుకలతో పాటు వివాహాది శుభకార్యాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఎంత ఖర్చయినా ఒక ఫ్లవర్ బొకేని కొనుక్కొని వెళ్లి అభినందనలు తెలియజేస్తాం. ఏ ధరకి కొన్నా ఒక ఫ్లవర్ బొకే జీవితకాలం కొన్ని గంటలు లేదా ఒక రోజు మాత్రమే. ఫ్లవర్ బొకేకి బదులు 20-–30 రూపాయలతో ఒక పచ్చని మొక్కను కొని బహుమతిగా ఇచ్చి అభినందనలు తెలియజేయండి. పచ్చని మొక్కల్లా పది కాలాలపాటు వారు పచ్చగా ఉండాలని కోరుకోండి. మీరిచ్చిన మొక్క పూవు/కాయ పూచినంతకాలం వారికి గుర్తుకొస్తూనే ఉంటారు. అది ఒక తీపి జ్ఞాపకమవుతుంది. ప్రతి ఒక్కరూ సంవత్సరంలో కనీసం ఐదు మొక్కలైనా నాటండి. దీంతో పర్యావరణ పరిరక్షణతో పాటు, వంద రకాల జీవులు బతుకుతాయి. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ఈ ‘ఫ్లవరు బొకే’ల సంస్కృతిని మాన్పించండి. ఒక పూల మొక్కతో హరిత శుభాభినందనలు తెలియజేయండి.

-– సాయిప్రకాష్ తిరునగరి

Updated Date - 2022-12-31T00:54:22+05:30 IST

Read more