కనుమరుగవుతున్న చెరువులు

ABN , First Publish Date - 2022-12-24T01:22:58+05:30 IST

తెలంగాణ ప్రాంతంలోని దాదాపు ప్రతి గ్రామంలో చెరువులు, కుంటలు కనుమరుగవుతున్నాయి.

కనుమరుగవుతున్న చెరువులు

తెలంగాణ ప్రాంతంలోని దాదాపు ప్రతి గ్రామంలో చెరువులు, కుంటలు కనుమరుగవుతున్నాయి. చెరువుల్ని చదును చేసి, బావులు తవ్వి వరి పంట సాగు చేస్తున్నారు. కుంటల్ని పూర్తిగా లేకుండా చేసి, సాగు చేస్తున్నారు. రెవెన్యూ చట్టం ప్రకారం ఈ భూముల్లో ఎవరూ సాగు చేయకూడదు. ఈ విషయంలో రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. చెరువులను కాపాడితే భూగర్భజలం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి చెరువులకు హద్దురాళ్లు వేసి కాపాడాలి. ఆ భూముల్లో సాగు చేయకుండా ప్రభుత్వం దృష్టి సారించాలి. స్వాతంత్ర్యానికి పూర్వం అప్పటి సర్కారు ప్రతి సర్వే నెంబర్‌లోని భూమిని కొలిపించి హద్దు రాళ్లు వేయించింది. కాని ఇప్పుడు అవి లేక రైతులకు సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం కూడా భూములన్నీ సర్వే చేయించి హద్దురాళ్లు ఏర్పాటు చేయాలి. రైతులకు, ప్రజలకు సమస్యలు లేకుండా చూడాలి.

– కొంగర రాజయ్య, కొలనూర్‌, పెద్దపల్లి జిల్లా

Updated Date - 2022-12-24T01:22:59+05:30 IST