Mumbai SHOCKER: డెలివరీ బాయ్ యువతిని లైంగికంగా వేధించాడు
ABN , First Publish Date - 2022-12-03T11:39:49+05:30 IST
ముంబయి నగరంలో మరో షాకింగ్ ఘటన వెలుగుచూసింది.(Mumbai SHOCKER) డెలివరీ బాయ్‌ల అకృత్యాలకు ...
ముంబయి (మహారాష్ట్ర): ముంబయి నగరంలో మరో షాకింగ్ ఘటన వెలుగుచూసింది.(Mumbai SHOCKER) డెలివరీ బాయ్‌ల అకృత్యాలకు తెర పడటం లేదు.ముంబయి నగరంలోని ఖార్ హౌసింగ్ సొసైటీలో కూరగాయలు అందించేందుకు వచ్చిన ఓ డెలివరీ బాయ్ ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను లైంగికంగా వేధించాడు. ఓ మహిళ జెప్టో డెలివరీ యాప్ ద్వారా కూరగాయలు ఆర్డర్ చేసింది. డెలివరీ బాయ్(Zepto Delivery Man) షాజాదే షేక్ కూరగాయలు డెలివరీ చేసేందుకు వచ్చిన ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను లైంగికంగా వేధించాడు.
మహిళను వీడియో తీయడంతోపాటు లైంగికంగా వేధించాడు. మహిళ ఫిర్యాదు మేర పోలీసులు డెలివరీ బాయ్ షాజాదే షేక్ పై ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు(Arrest) చేశారు.ఈ ఘటనలో తాము డెలివరీ బాయ్ పై కఠిన చర్యలు తీసుకుంటామని జెప్టో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.