స్నేహితుడితో ఫోన్లో మాట్లాడిందని..

ABN , First Publish Date - 2022-04-24T14:21:38+05:30 IST

స్నేహితుడితో ఫోనులో మాట్లాడినందుకు భార్యను భర్త కొట్టి చంపేశాడు. తిరువళ్ళికేణికి చెందిన పుగళ్‌కొడి అలియాస్‌ ఢిల్లీ (29) ఫుడ్‌ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు.

స్నేహితుడితో ఫోన్లో మాట్లాడిందని..

                      - భార్యను కొట్టి చంపిన భర్త


అడయార్‌(చెన్నై): స్నేహితుడితో ఫోనులో మాట్లాడినందుకు  భార్యను భర్త కొట్టి చంపేశాడు. తిరువళ్ళికేణికి చెందిన పుగళ్‌కొడి అలియాస్‌ ఢిల్లీ (29) ఫుడ్‌ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఇతడు ఆరుంబాక్కంకు చెందిన సరిత (21) ప్రేమించుకున్నారు. కుటుంబ సభ్యుల నిర్ణయానికి వ్యతిరేకంగా పెళ్ళి చేసుకుని ఏడాదిన్నరగా దురైప్పాక్కంలో కలిసి జీవిస్తున్నారు. ఈ నెల 17వ తేదీ రాత్రి సరిత తన స్నేహితుడితో ఫోనులో మాట్లాడింది. దీంతో ఆగ్రహించిన ఢిల్లీ భార్యను మందలించడంతో వారిద్దరిమధ్య వాగ్వాదం జరిగింది. ఢిల్లీ భార్యను తీవ్రంగా కొట్టడంతో ఆమె ప్రాణాలు విడిచింది. మరుసటి రోజు ఉదయం ఢిల్లీ సరిత జీవచ్ఛవంలా పడివుందంటూ హడావుడి చేసి ఆటోలో రాయపేట ఆస్పత్రికి తీసుకెళ్ళాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు శరీరంపై ఉన్న గాయాలు చూసి రాయపేట ఆస్పత్రి పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత దురైప్పాక్కం కన్నికాపురం పోలీసులకు కూడా సమాచారం చేరవేసి, ఈ కేసులో విచారణ జరపాలని ఆదేశించారు. ఢిల్లీని అదుపులోకి తీసుకుని విచారించగా, సరితను తానే హత్య చేసినట్టు అంగీకరించాడు. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Read more