Madhya Pradesh: రిజర్వ్ ఫారెస్ట్‌లో దారుణం.. చెట్టుకు వేళాడుతున్న పులి శరీరం..

ABN , First Publish Date - 2022-12-07T16:05:27+05:30 IST

మధ్యప్రదేశ్‌లోని పన్నా టైగర్ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. బుధవారం ఉదయం 2 ఏళ్ల పులి మృతదేహం చెట్టుకు వేలాడుతూ అటవీ అధికారుల కంట పడింది. మంగళవారం రాత్రి విక్రమ్‌పూర్‌ అడవిలో మగపులి చనిపోయి ఉందని అటవీ అధికారులకు సమాచారం అందింది.

Madhya Pradesh: రిజర్వ్ ఫారెస్ట్‌లో దారుణం.. చెట్టుకు వేళాడుతున్న పులి శరీరం..

మధ్యప్రదేశ్‌లోని పన్నా టైగర్ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. బుధవారం ఉదయం 2 ఏళ్ల పులి మృతదేహం చెట్టుకు వేలాడుతూ అటవీ అధికారుల కంట పడింది. మంగళవారం రాత్రి విక్రమ్‌పూర్‌ అడవిలో మగపులి చనిపోయి ఉందని అటవీ అధికారులకు సమాచారం అందింది. బుధవారం ఉదయం అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని చూడగా.. చెట్టుకు రెండేళ్ల పులి శరీరం వేలాడుతూ కనిపించింది. పులి మెడకు బైక్ క్లచ్ వైర్ బిగించి ఉంది.

బైక్ క్లచ్ వైర్లను ఎక్కువగా వేటగాళ్లు జంతువులను పట్టుకోవడానికి ఉపయోగిస్తారని, అభయారణ్యంలో వేరొక జంతువును పట్టుకోవడానికి సమీప గ్రామస్థులు ప్రయత్నించి ఉంటారని, ప్రమాదవశాత్తు పులి ఆ వైర్‌కు చిక్కుకుని ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు అధికారులు పులి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించి సాక్ష్యాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. 3500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న పన్నా టైగర్ రిజర్వ్‌లో 32 పులులు ఉంటాయని అంచనా.

Updated Date - 2022-12-07T16:05:28+05:30 IST