ప్రాణం తీసిన ఈత సరదా

ABN , First Publish Date - 2022-04-05T14:43:07+05:30 IST

ఈత సరదా ఇద్దరు యువకుల ప్రాణం తీసింది. నగర శివారు ప్రాంతమైన రెడ్‌హిల్స్‌ సమీపం లో పమ్మదుకుళంలో ఆదివారం నిర్వహించిన ఫుట్‌బాట్‌ పోటీ లు

ప్రాణం తీసిన ఈత సరదా

                       - పుళల్‌ జలాశయంలో నీట మునిగి ఇద్దరి మృతి


పెరంబూర్‌(చెన్నై): ఈత సరదా ఇద్దరు యువకుల ప్రాణం తీసింది. నగర శివారు ప్రాంతమైన రెడ్‌హిల్స్‌ సమీపం లో పమ్మదుకుళంలో ఆదివారం నిర్వహించిన ఫుట్‌బాట్‌ పోటీ లు చూసేందుకు పుళల్‌ ప్రాం తానికి చెందిన శ్యామ్‌ (22), విజయరాజ్‌ (19) తమ స్నేహితులతో కలసి వెళ్లారు. పోటీలు ముగిసిన తర్వాత అందరూ పుళల్‌ జలాశయంలో ఈతకు వెళ్లారు. ఊహించని విధంగా లోతైన ప్రాంతానికి వెళ్లిన శ్యామ్‌, విజయరాజ్‌ నీటమునిగిపోయారు. గమనించిన స్నేహితులు రెడ్‌హిల్స్‌ అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సిబ్బంది అక్కడకు చేరుకొని గంట పాటు గాలించి ఇద్దరి మృతదేహాలు వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం చెన్నై ప్రభుత్వ స్టాన్లీ ఆస్పత్రికి తరలించారు. రెడ్‌హిల్స్‌ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

Read more