Ayodhya Mosquesలపై అభ్యంతరకరమైన పోస్టర్లు...ఏడుగురు నిందితుల అరెస్ట్

ABN , First Publish Date - 2022-04-29T18:07:39+05:30 IST

అయోధ్య నగరంలోని పలు మసీదులపై అభ్యంతరకరమైన పోస్టర్లు వేసి, వస్తువులను విసిరి నగర శాంతి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న ఏడుగురిని అయోధ్య పోలీసులు గురువారం అరెస్టు....

Ayodhya Mosquesలపై అభ్యంతరకరమైన పోస్టర్లు...ఏడుగురు నిందితుల అరెస్ట్

అయోధ్య(ఉత్తరప్రదేశ్): అయోధ్య నగరంలోని పలు మసీదులపై అభ్యంతరకరమైన పోస్టర్లు వేసి, వస్తువులను విసిరి నగర శాంతి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న ఏడుగురిని అయోధ్య పోలీసులు గురువారం అరెస్టు చేశారు.అరెస్టయిన నిందితుల్లో మహేష్ కుమార్ మిశ్రా, ప్రత్యూష్ శ్రీవాస్తవ, నితిన్ కుమార్, దీపక్ కుమార్ గౌర్ అలియాస్ గుంజన్, బ్రిజేష్ పాండే, శత్రుఘ్న ప్రజాపతి, విమల్ పాండేలుగా గుర్తించారు. వీరంతా అయోధ్య వాసులని అయోధ్య సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శైలేష్ కుమార్ పాండే చెప్పారు. 11 మంది ఈ సంఘటనకు పాల్పడ్డారని, వారిలో ఏడుగురిని అరెస్టు చేశామని, మరో నలుగురు పరారీలో ఉన్నారని ఎస్పీ చెప్పారు.


‘‘మహేష్ నేతృత్వంలో నాలుగు మోటార్ సైకిళ్లపై 8 మంది వ్యక్తులు అభ్యంతరకరమైన పోస్టర్లు, వస్తువులను మసీదుల వెలుపల విసిరారు. పోలీసులు నిందితుల నుంచి అభ్యంతరకరమైన వస్తువులు, మొబైల్ ఫోన్, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.నిందితులపై గ్యాంగ్‌స్టర్స్ యాక్ట్,ఎన్‌ఎస్‌ఏ కింద కూడా చర్యలు తీసుకుంటామని ఎస్‌ఎస్‌పి తెలిపారు.మహేష్ కుమార్ మిశ్రా ప్రధాన కుట్రదారు అని, అతని ఇతర సహచరులతో కలిసి ఇటీవల ఢిల్లీ జహంగీర్‌పురిలో జరిగిన సంఘటనకు వ్యతిరేకంగా బ్రిజేష్ పాండే ఇంట్లో కుట్ర పన్నినట్లు తేలింది. నిందితులు అయోధ్యలోని మసీదు కాశ్మీరీ మొహల్లా, తత్షా మసీదు, ఘోసియానా రాంనగర్ మసీదు, ఈద్గా సివిల్ లైన్ మసీదు, దర్గా జైలు వెనుక ఉన్న గులాబ్ షా దర్గాపై అభ్యంతరకరమైన పోస్టర్లు,వస్తువులను విసిరారు.





అరెస్టయిన ఏడుగురిలో ముగ్గురు నిందితులకు గతంలో నేర చరిత్ర ఉందని కూడా పోలీసులు తెలిపారు.నిందితుడైన మహేష్‌పై అయోధ్యలోని కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. ఇది కాకుండా నిందితులు నితిన్, విమల్‌లపై కూడా కేసులు నమోదు చేశామని పోలీసు అధికారి తెలిపారు.

Updated Date - 2022-04-29T18:07:39+05:30 IST