బస్సులో మహిళపై లైంగిక వేధింపులు
ABN , First Publish Date - 2022-03-18T15:55:18+05:30 IST
తిరువణ్ణామలై నుంచి కోవైకు బయల్దేరిన ప్రభుత్వ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కండక్టర్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

- కండక్టర్‌కు దేహశుద్ధి
ప్యారీస్(చెన్నై): తిరువణ్ణామలై నుంచి కోవైకు బయల్దేరిన ప్రభుత్వ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కండక్టర్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తిరువణ్ణామలై జిల్లాలో ఓ గ్రామానికి చెందిన 22 ఏళ్ల మహిళ కోవై లోని ఓ అకాడమీలో చదువుకుంటున్నారు. ఆమె సెలవుల్లో కోవై నుంచి తిరువణ్ణామలైలో ఉన్న పుట్టింటికి వచ్చి వెళ్తుంటారు. అదే విధంగా మంగళవారం రాత్రి తిరువణ్ణామలై నుంచి కోవైకు ప్రభుత్వ బస్సులో ఆమె ఎక్కారు. ప్రయాణికులు ఎక్కువ మంది లేకపోవడం, అందులోనూ రాత్రి సమయం కావడంతో కండక్టర్‌గా వ్యవహరిం చిన ఈరోడ్ జిల్లాకు చెందిన పూవేంద్రన్ (31) నిద్ర పోతున్న యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె కేకలతో మేల్కొన్న ప్రయాణికులు, కండక్టర్‌ను చితకబాది కోవై నిలాంబూర్ పోలీసులకు అప్పగించారు.