బీజేపీ ఎంపీ ఇంట్లో దోపిడీ

ABN , First Publish Date - 2022-03-21T12:55:37+05:30 IST

బీజేపీ ఎంపీ ఇంట్లో దోపిడీ దొంగలు పడ్డారు...

బీజేపీ ఎంపీ ఇంట్లో దోపిడీ

రాయ్‌పూర్: బీజేపీ ఎంపీ ఇంట్లో దోపిడీ దొంగలు పడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లాలోని అంబికాపూర్ నగరంలో భారతీయ జనతా పార్టీ  రాజ్యసభ ఎంపీ రాంవిచార్ నేతమ్ నివాసంలో చోరీ జరిగినట్లు చీఫ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంబికాపూర్ తెలిపారు.బీజేపీ ఎంపి ఇంట్లో లక్ష రూపాయలు చోరీకి గురయ్యాయని, విచారణ నిమిత్తం గార్డులను విచారిస్తున్నామని ఎస్పీ చెప్పారు.‘‘మార్చి 18వతేదీన బీజేపీ ఎంపీ ఇంటి తాళాన్ని దొంగలు పగులగొట్టారు.లక్షరూపాయలను దొంగలు అపహరించారు.దోపిడీ విషయమై ఇంట్లో ఉన్న గార్డులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ ఇంట్లో దోపిడీ విషయమై దర్యాప్తు చేస్తున్నామని పోలీసు కమిషనర్ అఖిలేష్ కౌశిక్ చెప్పారు.


Updated Date - 2022-03-21T12:55:37+05:30 IST