Oxygen: ప్రాణవాయువు అందక ఊపిరి ఆగింది
ABN , First Publish Date - 2022-10-21T15:30:11+05:30 IST
చెంగల్పట్టు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్(Oxygen) కొరత కారణంగా ఇద్దరు వృద్ధులు మృతి చెందారు. దీంతో ఈ సంఘటనపై వైద్యశాఖ
- చెంగల్పట్టు ప్రభుత్వాసుపత్రిలో ఘటన
- అధికారుల విచారణ
చెన్నై, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): చెంగల్పట్టు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్(Oxygen) కొరత కారణంగా ఇద్దరు వృద్ధులు మృతి చెందారు. దీంతో ఈ సంఘటనపై వైద్యశాఖ ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. కాంచీపురం సమీపం నజరత్‌పేటకు చెందిన కళానిధి(64) అనే వృద్ధురాలు గత వారం శ్వాసకోస సమస్యతో ఆ ఆసుపత్రిలో చేరారు. కళానిధి మనవడు కార్తీక్ ఆమెను పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్ళాడు.. ఆ సందర్భంగా కళానిధికి తక్కువ మోతాదులో ఆక్సిజన్ సరఫరా అవుతుండటం గమనించి నర్సుకు ఫిర్యాదు చేశారు. ఆమె ఆసుపత్రి ఉన్నతాధికారులకు చెప్పేందుకు వెళ్లేలోగా కళానిధి ప్రాణాలు కోల్పోయారు. ఇదే విధంగా పూచ్చివాక్కంకు చెందిన రాధాకృష్ణన్ (70) అనే వృద్ధుడు కూడా ఆక్సిజన్ కొరత కారణంగా మృతి చెందాడని చెబుతున్నారు. ఈ రెండు సంఘటనలపై ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు.