మంత్రి సోదరుడి కుమార్తె ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-12-07T08:26:43+05:30 IST

సీనియర్‌ మంత్రి దురైమురుగన్‌(Minister Durai Murugan) సోదరుడి కుమార్తె రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. దురైమురుగన్‌

మంత్రి సోదరుడి కుమార్తె ఆత్మహత్య

వేలూరు(చెన్నై), డిసెంబరు 6: సీనియర్‌ మంత్రి దురైమురుగన్‌(Minister Durai Murugan) సోదరుడి కుమార్తె రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. దురైమురుగన్‌ సోదరుడు దురై మహాలింగం కుమార్తె భారతి (55) భర్త రాజ్‌కుమార్‌తో కలిసి కాట్పాడి గాంధీనగర్‌ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం లత్తేరి సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతదేహం రైలు పట్టాలపై పడి ఉండగా జోలార్‌పేట రైల్వే పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం అడుక్కంపారై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబసమస్యల కారణంగా ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు డీఎంకే వర్గాలు తెలిపాయి.

Updated Date - 2022-12-07T08:26:45+05:30 IST