రాజస్తాన్: 70 ఏళ్ల వ్యక్తి దారుణ హత్య

ABN , First Publish Date - 2022-07-01T16:20:11+05:30 IST

వ్యవసాయ పొలంలో నిద్రిస్తున్న ఒక వ్యక్తి(70) దారుణ హత్యకు గురయ్యారు. రాజస్తాన్‌లోని బరన్‌ జిల్లాలో గురువారం అర్థరాత్రి జరిగిందీ దారుణం. హత్యకు గురైన వ్యక్తి కన్హయ్యలాల్‌ మీనా అని, అతడు ఛబ్ర ప్రాంతంలోని ఖెర్ఖెడ గ్రామానికి చెందిన..

రాజస్తాన్: 70 ఏళ్ల వ్యక్తి దారుణ హత్య

జైపూర్: వ్యవసాయ పొలంలో నిద్రిస్తున్న ఒక వ్యక్తి(70) దారుణ హత్యకు గురయ్యారు. రాజస్తాన్‌లోని బరన్‌ జిల్లాలో గురువారం అర్థరాత్రి జరిగిందీ దారుణం. హత్యకు గురైన వ్యక్తి కన్హయ్యలాల్‌ మీనా అని, అతడు ఛబ్ర ప్రాంతంలోని ఖెర్ఖెడ గ్రామానికి చెందిన వ్యక్తని పోలీసులు గుర్తించారు. కాగా, ఈ హత్య కేసులో హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్న పది మంది స్థానికులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారిస్తున్నారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో కన్హయ్య తలకు విపరీతంగా గాయాలయ్యాయని తెలిపారు. అతడు చాలా రోజులుగా కుటుంబానికి దూరంగా ఉంటున్నాడని, ఎక్కువ సమయాన్ని వ్యవసాయ పొలంలో గడుపుతుంటాడని స్థానికులు తెలిపినట్లు పోలీసు అధికారి నెరిక్రం పేర్కొన్నారు. అయితే హత్యకు గల కారణం ఇంకా తెలియలేదని, అనుమానితులను విచారిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Read more