ప్రియురాలి గొంతుకోసి చంపిన వ్యక్తి అరెస్ట్

ABN , First Publish Date - 2022-06-16T20:42:54+05:30 IST

ప్రియురాలి గొంతు కోసి చంపిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని థానెలో జరిగిందీ సంఘటన. ప్రియురాలిని చంపి థానెలోనె పాతి పెట్టాడని పోలీసులు తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఒత్తిడి కారణంగానే ఈ హత్య..

ప్రియురాలి గొంతుకోసి చంపిన వ్యక్తి అరెస్ట్

ముంబాయి: ప్రియురాలి గొంతు కోసి చంపిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని థానెలో జరిగిందీ సంఘటన. ప్రియురాలిని చంపి థానెలోనె పాతి పెట్టాడని పోలీసులు తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఒత్తిడి కారణంగానే ఈ హత్య జరిగినట్లు తమ విచారణలో తేలినట్లు వారు పేర్కొన్నారు. నిందితుడు సచిన్ గోరఖ్‌నాథ్(40) కాగా, మృతురాలి పేరు ఆశా మోరె. పోలీసులు తెలిపిన వివరా ప్రకారం.. నిందితుడు ఆశా మోరెను జూన్ 14న తన అపార్ట్‌మెంట్‌కు రమ్మని పిలిచాడు. అయితే పెళ్లి గురించి సచిన్‌పై ఆమె ఒత్తిడి తెచ్చింది. ఇద్దరి మధ్య వివాదం పెరిగి ఆమెను అక్కడే చంపేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని ఒక చోట పాతిపెట్టాడు. పోలీసులు ఈ నేరం గురించి తెలుసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకోవడంతో పాటు మృతదేహాన్ని గుర్తించి పోస్ట్‌మార్టంకు పంపారు.

Read more