భార్యగా భావించి మరో మహిళ హత్య

ABN , First Publish Date - 2022-05-22T15:24:25+05:30 IST

భార్యగా భావించి మరో మహిళను హత్యచేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. తిరువణ్ణామలై ఇందిరానగర్‌కు చెందిన ఆవుల వ్యా పారి దేవేంద్రన్‌ (50) భార్య రేణుకాంబాళ్‌ రెండేళ్ల క్రితం

భార్యగా భావించి మరో మహిళ హత్య

                                           - నిందితుడి అరెస్టు


వేలూరు(చెన్నై): భార్యగా భావించి మరో మహిళను హత్యచేసిన  వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. తిరువణ్ణామలై ఇందిరానగర్‌కు చెందిన ఆవుల వ్యా పారి దేవేంద్రన్‌ (50) భార్య రేణుకాంబాళ్‌ రెండేళ్ల క్రితం మృతిచెందింది. దీంతో తిరుపత్తూర్‌ జిల్లా ఆంబూరుకు చెందిన ధనలక్ష్మిని రెండో వివాహం చేసుకున్నాడు. దేవేంద్రన్‌ తరచూ మద్యం సేవించి ఇంటికొస్తుండడంతో భార్యాభర్త మధ్య గొడవలు జరుగుతుండేవి. గురువారం రాత్రి గొవడలు తీవ్రస్థాయికి చేరడంతో ఇంట్లోకి బయటకు వచ్చిన ధనలక్ష్మి ఆంబూరుకు చేరుకొంది. అక్కడి నేతాజీ రోడ్డు సమీపంలోని ఫ్లాట్‌ఫారంపై పలువురు నిరాశ్ర యులు ఉంటారు. ఈ క్రమంలో ఆమె అక్కడికి చేరింది. అర్ధరాత్రిలో భార్యను చంపేయాలని కత్తితో బయలుదేరాడు. ఒంటి గంటలకు ఫ్లాట్‌ ఫారం వద్దకు చేరుకున్నాడు. ఫ్లాట్‌ఫారంపై అనేకమంది మహిళలు వరుసగా నిద్రిస్తున్నారు. దోమల బెడదతో వారు మొఖాలకు చీరలు కప్పుకున్నారు. వారిలో భార్య ధనలక్ష్మి అనుకొని మరొక మహిళపై దేవేంద్రన్‌ దాడి చేశాడు. ఊహించని ఘటనతో ఆ మహిళ అతడి నుంచి తప్పించుకొనేందుకు యత్నించగా దేవేంద్రన్‌ అమెను వెంటాడి దాడిచేయడంతో మృతిచెందింది. అంతలో భార్య ధనలక్ష్మి లేవడంతో ఆమెపై దాడికి యత్నించడంతో చుట్టుపక్కల వారు అతడిని పట్టుకొని ఆంబూరు పోలీసులకు అప్పగించారు. కాగా మృతురాలు ఆంబూరు కంచికొల్లైకు చెందిన నవీత్‌ భార్య కౌసర్‌ (27) అని దొంగతనం కేసులో అరెస్ట్‌ కావడంతో చుట్టుపక్కల వారు తరిమివేయడంతో ఆమె ఫ్లాట్‌ఫారంపై ఉంటోందని పోలీసుల విచారణలో తెలిసింది. కేసు నమోదుచేసిన పోలీసులు గాయపడిన ధనలక్ష్మిని చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరచి జైలుకు తరలించారు. Updated Date - 2022-05-22T15:24:25+05:30 IST