అన్నం తినేందుకు రమ్మని పిలుస్తూ డాబాపైకి వెళ్లిన తల్లి.. సగం కాలిన స్థితిలో కొడుకు శవం.. అసలేం జరిగిందో తెలిసి..

ABN , First Publish Date - 2022-01-27T23:39:29+05:30 IST

డాబాపైన ఉన్న కొడుకు కిందికొస్తాడేమో అని ఆ తల్లి చాలాసేపు ఎదురు చూసింది. ఎంతకూ రాకపోవడంతో అన్నం తినేందుకు రమ్మని

అన్నం తినేందుకు రమ్మని పిలుస్తూ డాబాపైకి వెళ్లిన తల్లి.. సగం కాలిన స్థితిలో కొడుకు శవం.. అసలేం జరిగిందో తెలిసి..

రాజస్థాన్: డాబాపైన ఉన్న కొడుకు కిందికొస్తాడేమో అని ఆ తల్లి చాలాసేపు ఎదురు చూసింది. ఎంతకూ రాకపోవడంతో అన్నం తినేందుకు రమ్మని పిలుస్తూ ఆమే పైకి వెళ్లింది. తర్వాత అక్కడ కనిపించిన దృశ్యం చూసి, ఆ తల్లి షాకైంది. సగం కాలిన స్థితిలో ఉన్న కొడుకు శవాన్ని చూసి బోరుమంది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తిచింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకెళ్తే..


రాజస్థాన్‌లోని చౌమున్ ప్రాంతానికి చెందిన బాబులాల్, ఆశాదేవి దంపతులకు ఇద్దరు కుమారులు. రెండో కొడుకు వికాస్ శర్మ(35) మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అయితే బుధవారం సాయంత్రం 6.30 గంటలకు ఆశాదేవి డాబాపైకి వెళ్లింది. వికాస్ శర్మ మద్యం సేవిస్తుండటాన్ని చూసి కొందకొచ్చి.. వంట పని పూర్తి చేసింది. వికాస్ శర్మ కిందకొస్తే అతడికి అన్నం పెడదామని ఎదురు చూసింది. ఎంతకూ రాకపోవడంతో వికాస్‌ని పిలుస్తూ ఆమే డాబా పైకి వెళ్లింది. అక్కడ మంచం మీద సగం కాలిన స్థితిలో ఉన్న కొడుకును చూసి బోరుమంది. ఆమె ఏడుపులు విని కుటుంబసభ్యులు, స్థానికులు అక్కడకు చేరుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఫోరెన్సిక్ బృందం సహాయంతో ఆధారాలు సేకరించారు. ఈ క్రమంలోనే అతడు మరణించాడానికి గల కారణాలను తాజాగా వెల్లడించారు. 


వికాస్‌కు మద్యంతో పాటు ధూమపానం కూడా అలవాటు ఉందని ఏసీపీ రాజేంద్ర సింగ్ నిర్వాన్ తెలిపారు. బుధవారం సాయంత్రం డాబాపై ఉన్న మంచంలో కూర్చొని వికాస్ పూటుగా మద్యం తాగాడని పేర్కొన్నారు. మద్యం మత్తులో ఉండగానే సిగరెట్ వెలిగించాడని.. అదే సమయంలో అతడికి మూర్చ వచ్చినట్టు వెల్లడించారు. ఈ క్రమంలో వికాస్ చేతిలో ఉన్న సిగరెట్ మంచం మీద పడి.. మంటలు చుట్టుముట్టాయని చెప్పారు. ఆ మంటల్లోనే వికాస్ సజీవదహనమయ్యాడనే ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు పేర్కొన్నారు. పోస్టుమార్టం అనంతరం వికాస్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. కొన్నేళ్ల కిందటే వికాస్ తండ్రి అనారోగ్యంతో చనిపోగా.. 2021లో వికాస్ సోదరుడు కరోనాతో మృతిచెందాడు. తాజాగా వికాస్ కూడా ప్రాణాలు కోల్పోవడంతో ఆశాదేవి రోదనలు మిన్నంటాయి.

Updated Date - 2022-01-27T23:39:29+05:30 IST