Elephant: రైలు ఢీకొని ఏనుగు మృతి

ABN , First Publish Date - 2022-10-15T13:13:37+05:30 IST

కోవై సమీపం కొట్టాంపట్టి వద్ద శుక్రవారం వేకువజామున రైలు ఢీకొని ఓ ఆడ ఏనుగు(Elephant) మృతి చెందింది. కోయంబత్తూరు సమీపంలోని అట

Elephant: రైలు ఢీకొని ఏనుగు మృతి

చెన్నై, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): కోవై సమీపం కొట్టాంపట్టి వద్ద శుక్రవారం వేకువజామున రైలు ఢీకొని ఓ ఆడ ఏనుగు(Elephant) మృతి చెందింది. కోయంబత్తూరు సమీపంలోని అటవీ ప్రాంతాల నుంచి కేరళకు ప్రతిరోజూ వందల సంఖ్యలో అడవి ఏనుగులు వెళుతుంటాయి. ఆ మేరకు శుక్రవారం వేకువజాము నాలుగు గంటలకు పదికి పైగా అడవి ఏనుగులు కొట్టాంపట్టి వద్ద  రైలు పట్టాలను దాటుతుండగా కన్నియాకుమారి నుంచి అసోమ్‌ వెళ్తున్న వివేకా ఎక్స్‌ప్రెస్‌(Viveka Express) ఢీకొనటంతో ఓ ఆడ ఏనుగు తీవ్రంగా గాయపడి మరణించింది. రైలు లోకోపైలట్‌ ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు, అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

Updated Date - 2022-10-15T13:13:37+05:30 IST