ఎమ్మెల్యే అన్న కుమారుడి అదృశ్యం

ABN , First Publish Date - 2022-11-03T12:02:16+05:30 IST

దావణగెరె జిల్లా హొన్నాళి బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య(BJP MLA Renukacharya) అన్న రమేశ్‌ కు మారుడు చంద్రశేఖర్‌ అదృశ్య మయ్యాడు

ఎమ్మెల్యే అన్న కుమారుడి అదృశ్యం

బెంగళూరు, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): దావణగెరె జిల్లా హొన్నాళి బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య(BJP MLA Renukacharya) అన్న రమేశ్‌ కు మారుడు చంద్రశేఖర్‌ అదృశ్య మయ్యాడు. ఆదివారం శివమొగ్గ నుంచి హొన్నాళి వైపు ప్రయాణిస్తూనే మార్గమధ్యంలో కారు ఆపారు. అక్కడి నుంచి ఎటు వైపు వెళ్లారనేది తెలియ రావడం లేదు. చంద్రశేఖర్‌ ప్రయాణిస్తున్న కారు సుర హొన్నె వద్ద ఆగిపోయింది. ఇక ఆదివారం అర్ధరాత్రి నుంచి అతడి సమాచారం తెలియరావడం లేదు. మొబైల్‌ స్విచ్ఛాఫ్‌ కావడం, కారు ఆపిన ప్రదేశం నుంచి మరో కారు రావడంతో అనుమానాలకు తావిస్తోంది. చంద్ర శేఖర్‌కు ఆధ్యాత్మికత ఆసక్తి ఉండేది. శివమొగ్గలోని గౌరి గద్దెకు వెళ్లి వినయ్‌ గురూజీని స్నేహితుడు కిరణ్‌తో పాటు కలిశారు. శివమొగ్గలో భోజనం చేసి దావణగెరె జిల్లా న్యామతి తాలూకా చేరుకునేదాకా ఆచూకీ కొనసాగింది. మూడు రోజులైనా చంద్రశేఖర్‌ వివరాలు తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. అన్నకుమారుడు కనిపించకపోవడంతో ఎమ్మెల్యే రేణుకాచార్య కంటతడి పెట్టారు. ఎక్కడ ఉన్నా వెంటనే రావాలని రోదించారు.

Updated Date - 2022-11-03T12:59:55+05:30 IST