పాఠశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ

ABN , First Publish Date - 2022-12-07T08:59:57+05:30 IST

తిరునల్వేలి(Tirunalveli) జిల్లా కల్లకాడు ప్రభుత్వ మహోన్నత పాఠశాలలో మంగళవారం ఉదయం విద్యార్థులు ఘర్షణపడ్డారు.

పాఠశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ

- ఒకరికి కత్తిపోట్లు

చెన్నై, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): తిరునల్వేలి(Tirunalveli) జిల్లా కల్లకాడు ప్రభుత్వ మహోన్నత పాఠశాలలో మంగళవారం ఉదయం విద్యార్థులు ఘర్షణపడ్డారు. ఈ సంఘటనలో ఓ విద్యార్థి కత్తిపోట్లతో గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ పాఠశాలలో కొద్ది రోజుల క్రితం నోటు పుస్తకాన్ని దాచిన విద్యార్థులకు, మరో వర్గానికి చెందిన విద్యార్థులకు మధ్య చిన్న గొడవ జరిగింది. ఆ సందర్భంగా గొడవపడిన విద్యార్థులను హెడ్మాస్టర్‌ హెచ్చరించి వారి తల్లిదండ్రులను తీసుకురావాలని ఆదేశించారు. దీంతో ఆ విద్యార్థులు కోపంగా మంగళవారం ఉదయం కత్తులతో పాఠశాలకు వెళ్ళి తమ ప్రత్యర్థి వర్గానికి చెందిన విద్యార్థులపై దాడికి దిగారు. ఈ సంఘటనలో ఓ విద్యార్థికి గాయాలయ్యాయి. వెంటనే ఆ విద్యార్థిని చికిత్స నిమిత్తం పాళయంకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘర్షణ గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఆ పాఠశాల వద్దకు వెళ్ళి విచారణ జరిపారు. జిల్లా విద్యాశాఖాధికారులు కూడా ఆ స్కూలుకు వెళ్ళి పరిశీలించారు.

Updated Date - 2022-12-07T08:59:59+05:30 IST