Cheetah: రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి

ABN , First Publish Date - 2022-12-08T12:08:13+05:30 IST

చిత్రదుర్గ(Chitradurga) జిల్లా చెళ్లకెర - కూడ్లిగి జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీ కొని చిరుత(

Cheetah: రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి

బళ్లారి(బెంగళూరు), డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): చిత్రదుర్గ(Chitradurga) జిల్లా చెళ్లకెర - కూడ్లిగి జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీ కొని చిరుత(Cheetah) మృతి చెందింది. జాతీయ రహదారి పక్కనే అడవి ఉంది. రోడ్డు దాటే క్రమంలోనే వాహనం ఢీకొని ఉంటుందని తెలుస్తోంది. దీంతో చిరుత తల భాగం, కళ్లు బాగా దెబ్బతినడంతో అక్కడిక్కడే మృతి చెందింది. దీన్ని ఇతర వాహన దారులు చూసి సోషల్‌ మీడియాల్లో పోస్టు చేశారు. చిత్రదుర్గ ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారులు చిరుతను అక్కడే గుంత తీసి ఖననం చేశారు. ఇక్కడ అడవిలో చిరుతలు ఎక్కువగా ఉన్నాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు.

Updated Date - 2022-12-08T12:08:17+05:30 IST