కొత్తగా కోడలు వచ్చిందని సంతోష పడ్డారు.. అయితే శోభనం మరుసటి రోజే అంతా ఆస్పత్రిలో చేరిక.. చివరకు అసలు విషయం తెలుసుకుని..

ABN , First Publish Date - 2022-02-28T01:09:53+05:30 IST

కొడుకు పెళ్లిని తమ స్థోమత మేరకు ఘనంగా చేశారు. అంతా అనుకున్న ప్రకారమే జరగడంతో.. ఇక ఏ సమస్యలూ ఉండవని దీమాగా ఉన్నారు. కోడలు వచ్చిన వేళా విశేషం.. అంటూ ఆ అత్తగారు సంతోషంతో..

కొత్తగా కోడలు వచ్చిందని సంతోష పడ్డారు.. అయితే శోభనం మరుసటి రోజే అంతా ఆస్పత్రిలో చేరిక.. చివరకు అసలు విషయం తెలుసుకుని..

కొడుకు పెళ్లిని తమ స్థోమత మేరకు ఘనంగా చేశారు. అంతా అనుకున్న ప్రకారమే జరగడంతో.. ఇక ఏ సమస్యలూ ఉండవని దీమాగా ఉన్నారు. కోడలు వచ్చిన వేళా విశేషం.. అంటూ ఆ అత్తగారు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. చుట్టుపక్కల వారికి తమ కోడలి గురించి చెప్పుకుని మురిసిపోయారు. కొడుకు, కోడలితో సంతోషంగా గడిపారు. అయితే శోభనం మరుసటి రోజు చూస్తే.. కుటుంబ సభ్యులంతా ఆస్పత్రిలో ఉన్నారు. ముందు ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. చివరకు అసలు విషయం తెలుసుకుని అంతా అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళితే.. 


రాజస్థాన్‌లోని జైపూర్‌ పరిధి  జైపూర్జిల్లా కోట్‌పుట్లీ పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి ఇటీవలే వివాహమైంది. వధువును చూసినందుకు గాను.. మధ్యవర్తికి రూ.1.50లక్షలు ఇచ్చేలా మాట్లాడుకున్నారు. అనుకున్న ప్రకారమే వివాహం కూడా ఫిబ్రవరి 22న తమకు ఉన్నంతలో ఘనంగా నిర్వహించారు. కొడుకు, కోడలు ఇంట్లోకి అడుగు పెట్టడంతో తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. తమ కోడలి గురించి అందరి ముందూ గొప్పగా చెప్పకొన్నారు. రెండు రోజుల పాటు అంతా సంతోషంగా గడిపారు. శోభనం రోజు గడిచాక మరుసటి రోజు పొద్దునే.. ఎవరూ బయటికి రాకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు.. అపస్మారక స్థితిలో ఉన్న కుటుంబ సభ్యులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

కంప్లయింట్ ఇవ్వడానికి వస్తే.. ఏకంగా కాపురమే పెట్టేశాడు.. ఈ కానిస్టేబుల్ చేసిన పని చివరకు ఎంత వరకు వెళ్లిందంటే..


పోలీసుల విచారణలో సంచలన నిజాలు వెలుగుచూశాయి. శోభనం రోజు అందరికీ భోజనం వడ్డించిన కోడలు పూజ.. తాను మాత్రం తినలేదు. ఆకలిగా లేదేమో అని అంతా అనుకున్నారు. అయితే ఆ అన్నంలో మత్తుమందు కలిపిందని వారు తెలుసుకోలేకపోయారు. అంతా అపస్మారక స్థితిలోకి వెళ్లగానే.. ఇంట్లోని నగలు, నగదును తీసుకుని పరారైంది. పెళ్లి సమయంలో ఆమె చెప్పిన చిరునామా కూడా తప్పని తేలింది. కేవలం డబ్బుల కోసమే పెళ్లిళ్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. పెళ్లికి ఒప్పించిన మధ్యవర్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పెళ్లికుమార్తె కోసం గాలిస్తున్నారు.

ఒంటరి గదిలో ప్రియురాలికి దోశ తినిపిస్తోన్న ప్రియుడు.. అంతలో ఉన్నట్టుండి ఊహించని ఘటన.. చివరికి ఏం జరిగిందంటే..

Updated Date - 2022-02-28T01:09:53+05:30 IST