Wedding Off : నిశ్చితార్థం అయ్యాక వధువు పెళ్లి రద్దు చేసుకోవడంతో వరుడు ఏం చేశాడంటే...

ABN , First Publish Date - 2022-12-09T10:42:36+05:30 IST

నిశ్చితార్థం అయ్యాక వధువు పెళ్లి రద్దు చేసుకోవడంతో కలత చెందిన వరుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన....

Wedding Off : నిశ్చితార్థం అయ్యాక వధువు పెళ్లి రద్దు చేసుకోవడంతో వరుడు ఏం చేశాడంటే...
Wedding Off

బెంగళూరు(కర్ణాటక): నిశ్చితార్థం అయ్యాక వధువు పెళ్లి రద్దు చేసుకోవడంతో కలత చెందిన వరుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో జరిగింది.(Wedding Off) బెంగళూరు నగరానికి చెందిన మోహన్ కుమార్ మగాడి రోడ్‌లోని హోసపాళ్య ప్రాంతానికి చెందిన కావ్య శ్రీతో నిశ్చితార్థం జరిగింది. పెళ్లి తర్వాత కూడా వధువు(Fiancee) కావ్యశ్రీ చదువుకునేందుకు,వివాహ ఏర్పాట్ల కోసం అమ్మాయి కుటుంబానికి వరుడు రూ.10 లక్షలు కూడా ఇచ్చాడు. భర్తపై పుకార్లు విని కావ్యశ్రీ పెళ్లిని రద్దు చేసుకుంది. మాట్లాడేందుకు కావ్యశ్రీ ఇంటికి వెళితే వరుడిని బయటకు నెట్టి అవమానించారు.

దీంతో ఆవేదన చెందిన వరుడు మోహన్ కుమార్ అమ్మాయి ఇంటి సమీపంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో వరుడి తండ్రి రంగస్వామయ్య కాబోయే కోడలి కుటుంబంపై కేసు పెట్టారు. కావ్యశ్రీ, ఆమె తల్లి వరలక్ష్మమ్మ, వారి బంధువు జయరామయ్యలు తమ కుమారుడి ఆత్మహత్యకు ప్రేరేపించారని కేసు పెట్టారు. నిందితులు పరారీలో ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేసి వారి కోసం గాలిస్తున్నారు.

Updated Date - 2022-12-09T10:42:37+05:30 IST