బావిలో విసిరి ఆరుగురు చిన్నారుల్ని కడతేర్చిన తల్లి
ABN , First Publish Date - 2022-05-31T17:01:23+05:30 IST
మహారాష్ట్ర(Maharashtra)లో దారుణం వెలుగు చూసింది. కన్న తల్లే(mother) తన బిడ్డల్ని కడతేర్చింది. తన ఆరుగురి చిన్నారుల్ని(six children) (ఇందులో ఐదుగురు బాలికలు) నిర్దాక్షిణ్యంగా బావి(well)లో విసిరిందని, వారంతా మృతి చెందారని..

ముంబై: మహారాష్ట్ర(Maharashtra)లో దారుణం వెలుగు చూసింది. కన్న తల్లే(mother) తన బిడ్డల్ని కడతేర్చింది. తన ఆరుగురి చిన్నారుల్ని(ఇందులో ఐదుగురు బాలికలు) నిర్దాక్షిణ్యంగా బావి(well)లో విసిరిందని, వారంతా మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఇంట్లో జరిగిన గొడవల కారణంగా తల్లి ఇలా ప్రవర్తించిందని వారు తెలిపారు. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా మహద్ తాలూకాలో మంగళవారం ఈ ఘటన జరిగింది. మహిళ(30)ను భర్త తరపు బంధువులు తీవ్రంగా కొట్టారట, దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన మహిళ తన పిల్లల్ని అందరినీ బావిలో విసిరేసిందని స్థానిక పోలీసు అధికారి ఒకరు తెలిపారు. చనిపోయిన చిన్నారులంతా 18 నెలల నుంచి 10 ఏళ్ల వయసు మధ్య ఉంటారని ఆయన పేర్కొన్నారు.