పోలీస్ స్టేషన్‌లో 5గురు పోలీసులు, ఒక హోంగార్డ్‌పై కత్తితో దాడి

ABN , First Publish Date - 2022-06-23T02:17:39+05:30 IST

పోలీస్ స్టేషన్‌లోనే ఐదుగురు పోలీసులు, ఒక హోంగార్డ్‌లో 29 ఏళ్ల యువకుడు కత్తితో దాడి చేశాడు. ఆరుగురికి కత్తి పోట్లు దిగాయి. ఇందులో ఒక పోలీసు పరిస్థితి విషమంగా ఉందని, మిగతా వారి పరిస్థితి పరవాలేదని వైద్యులు తెలిపారు..

పోలీస్ స్టేషన్‌లో 5గురు పోలీసులు, ఒక హోంగార్డ్‌పై కత్తితో దాడి

న్యూఢిల్లీ: పోలీస్ స్టేషన్‌లోనే ఐదుగురు పోలీసులు, ఒక హోంగార్డ్‌లో 29 ఏళ్ల యువకుడు కత్తితో దాడి చేశాడు. ఆరుగురికి కత్తి పోట్లు దిగాయి. ఇందులో ఒక పోలీసు పరిస్థితి విషమంగా ఉందని, మిగతా వారి పరిస్థితి పరవాలేదని వైద్యులు తెలిపారు. ఈ ఘటన జరిగింది స్వయంగా దేశ రాజధానిలో. ఢిల్లీలోని సైబర్ సెల్ పోలీస్ట్ స్టేషన్‌లో బుధవారం కత్తితో వచ్చి పోలీసులపై దాడికి దిగాడు. నిందితుడి పేరు భరత్ భాటి అని పోలీసులు తెలిపారు. ఈ విషయమై ఒక సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ ‘‘నిందితుడు పదునైన కత్తితో స్టేషన్‌కు వచ్చాడు. మూడో అంతస్థుకు వెళ్లి పోలీసులపై దాడి చేశాడు. ఒక్కసారిగా అక్కడున్నవారు భయంతో పరుగులు తీశారు. వాస్తవానికి అతడు ఫిర్యాదు చేసేందుకు వచ్చి ఇలా విచక్షణా రహితంగా వ్యవహరించాడు. అతడెందుకు అలా వ్యవహరించాడో తెలియదు. నిందితుడిని పట్టుకుని విచారిస్తాం. అతడి ఆరోగ్యంపై వైద్యులను సంప్రదించాం’’ అని అన్నారు. నిందితుడు మూడో అంతస్థుకు చేరుకున్న సమయంలో వీడియో తీస్తూ వచ్చాడని, కొంత మంది పోలీసులతో వాగ్వాదం చేసిన అనంతరం కత్తి బయటికి తీసి విధ్వంసం సృష్టించాడనికి ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు.

Read more