జూనియర్ కొలీగ్‌పై అత్యాచారం.. 31 ఏళ్ల వ్యక్తికి అరదండాలు

ABN , First Publish Date - 2022-06-26T22:43:52+05:30 IST

జూనియర్ కొలీగ్ అయిన యువతిపై అత్యాచారానికి తెగబడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి పింప్రి చించ్వాడ్

జూనియర్ కొలీగ్‌పై అత్యాచారం.. 31 ఏళ్ల వ్యక్తికి అరదండాలు

పూణె: జూనియర్ కొలీగ్ అయిన యువతిపై అత్యాచారానికి తెగబడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి పింప్రి చించ్వాడ్ పోలీసులు అరదండాలు వేశారు. ఓ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ కంపెనీలో పనిచేస్తున్న బాధిత యువతి (20) శనివారం పోలీసులకు ఫిర్యాదు చేస్తూ నిందితుడు తనపై రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని పేర్కొంది. అతడి ఇంట్లో తనకు ఆల్కహాల్ ఇచ్చి తొలిసారి తనపై అఘాయిత్యం చేశాడని, ఆ తర్వాత ఆ ఫొటోలు చూపించి బెదిరించి రెండోసారి అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించింది. 


పోలీసుల కథనం ప్రకారం.. బీహార్‌కు చెందిన నిందితుడు ఈ నెల 6న బాధితురాలిని తన ఇంటికి విందుకు ఆహ్వానించాడు. ఆ సమయంలో ఆమెకు విస్కీ ఇచ్చి ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నాలుగు రోజుల తర్వాత అంటే 10వ తేదీన ఆమెను మరోమారు తన ఇంటికి పిలిచాడు. తొలిసారి అత్యాచారానికి పాల్పడినప్పుడు తీసిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తానని బెదిరించి మరోమారు లొంగదీసుకున్నాడు. శనివారం (25న) నిందితుడు మరోమారు ఆమెను తన ఇంటికి పిలవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-06-26T22:43:52+05:30 IST