Skipping Video Stunt చేస్తూ 10 ఏళ్ల బాలుడి మృతి

ABN , First Publish Date - 2022-06-23T21:47:42+05:30 IST

ఒక వీడియో స్టంట్ చేయబోతూ స్కిప్పింగ్ తాడుకు ఇరుక్కుని 10 ఏళ్ల బాలుడు మృతి చెందినట్లు ఢిల్లీ పోలీసులు గురువారం వెల్లడించారు. ఈశాన్య ఢిల్లీలోని కర్తార్ నగర్‌కు చెందిన ఈ బాలుడు తన తల్లితో కలిసి ఇంట్లో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగిందని వారు పేర్కొన్నారు. ఆ బాలుడికి స్టంట్స్ వీడియోలు ఎక్కువగా చూసేవాడట..

Skipping Video Stunt చేస్తూ 10 ఏళ్ల బాలుడి మృతి

న్యూఢిల్లీ: ఒక వీడియో స్టంట్ చేయబోతూ స్కిప్పింగ్ తాడుకు ఇరుక్కుని 10 ఏళ్ల బాలుడు మృతి చెందినట్లు ఢిల్లీ పోలీసులు గురువారం వెల్లడించారు. ఈశాన్య ఢిల్లీలోని కర్తార్ నగర్‌కు చెందిన ఈ బాలుడు తన తల్లితో కలిసి ఇంట్లో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగిందని వారు పేర్కొన్నారు. ఆ బాలుడికి స్టంట్స్ వీడియోలు ఎక్కువగా చూసేవాడట. చూడటమే కాకుండా అప్పుడప్పులు అలాంటి ప్రయత్నించేవాడట. ఇలాగే బుధవారం సాయంత్రం 7 గంటలకు స్కిప్పింగ్ తాడుతో ఒక స్టంట్ ప్రయత్నిస్తుండగా తాడు మెడకు చుట్టుకుంది. ఊపిరాడక బాలుడు అపస్మారక స్థితికి వెళ్లాడు. వైద్యం కోసం ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. అయితే దీనిపై ఎలాంటి కేసు నమోదు కాలేదని, సెక్షన్ 174 ప్రకారం తదుపరి పనులు నిర్వర్తిస్తున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

Read more