21 నెలల కనిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం

ABN , First Publish Date - 2022-12-15T01:25:18+05:30 IST

టోకు ధరల (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 21 నెలల కనిష్ఠానికి తగ్గింది...

21 నెలల కనిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం

నవంబరులో 5.85 శాతానికి తగ్గిన సూచీ

న్యూఢిల్లీ: టోకు ధరల (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 21 నెలల కనిష్ఠానికి తగ్గింది. గత నెలలో సూచీ 5.85 శాతానికి జారుకుంది. 2021 ఫిబ్రవరి తర్వాత ఇదే అత్యల్ప స్థాయి. ఆహారోత్పత్తులు, ఇంధనం, తయారీ వస్తు ధరలు తగ్గుముఖం పట్టడం ఇందుకు దోహదపడింది. ఈ ఏడాది మే నెల నుంచి క్రమంగా తగ్గుతూ వస్తున్న టోకు ద్రవ్యోల్బణం.. అక్టోబరులో రెండంకెల లోపు స్థాయికి (8.39 శాతం) దిగివచ్చింది. కేంద్ర వాణిజ్య శాఖ బుధవారం విడుదల చేసిన డేటా ప్రకారం.. ఈ నవంబరులో ఆహారోత్పత్తుల టోకు ద్రవ్యోల్బణం 1.07 శాతానికి పరిమితమైంది. అక్టోబరులో 8.33 శాతంగా ఉంది. కూరగాయల ద్రవ్యోల్బణం ఏకంగా మైనస్‌ 20.08 శాతానికి తగ్గింది. కోర్‌ ఇన్‌ఫ్లేషన్‌ రెండేళ్ల కనిష్ఠ స్థాయి 3.5 శాతానికి పరిమితమైంది.

Updated Date - 2022-12-15T01:25:21+05:30 IST