Vodafone Idea: ఈ ప్లాన్ ఉండేది మరో మూడు రోజులే!

ABN , First Publish Date - 2022-10-29T16:50:15+05:30 IST

యూజర్లను ఆకర్షించిన ఈ ప్లాన్‌ మరో మూడు రోజుల్లో కనుమరుగు కానుంది. ఈ ప్లాన్ ప్రయోజనాలను అందుకోవాలంటే

Vodafone Idea: ఈ ప్లాన్ ఉండేది మరో మూడు రోజులే!

న్యూఢిల్లీ: దేశంలోని మూడో అతిపెద్ద టెల్కో వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) ఇటీవల ప్రవేశపెట్టిన ఫెస్టివ్ ఆఫర్‌ (Diwali Offer)ను తొలగించాలని నిర్ణయించింది. దీపావళికి ముందు ప్రవేశపెట్టిన ఈ ఆఫర్‌లో యూజర్లకు కొన్ని అదనపు ప్రయోజనాలు లభిస్తున్నాయి. యూజర్లను ఆకర్షించిన ఈ ప్లాన్‌ మరో మూడు రోజుల్లో కనుమరుగు కానుంది. ఈ ప్లాన్ ప్రయోజనాలను అందుకోవాలంటే అక్టోబరు 31లోపు రీచార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది.

ఈ నెల 18న ప్రవేశపెట్టిన దివాలీ ఆఫర్‌లో భాగంగా రెగ్యులర్ ప్రీపెయిడ్ ప్లాన్లను రీచార్జ్ చేయించుకునే వారికి అదనపు డేటా లభిస్తుంది. కొత్త ప్లాన్లు ప్రకటించకుండా రెగ్యులర్ రీచార్జ్ ప్లాన్లకే అదనపు డేటా ఇస్తున్నట్టు వీఐ ప్రకటించింది. మొత్తం మూడు ప్రీపెయిడ్ ప్లాన్లకు బోనస్ డేటా ఇస్తున్నట్టు తెలిపింది. వీటిలో రూ. 1,499, రూ.2,899, రూ.3,099 ప్లాన్లు ఉన్నాయి. అదనపు డేటా కావాలనుకునే వారు ఈ ప్లాన్లలో ఏదో ఒకదాన్ని ఈ నెల 31లోపు రీచార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది.

రూ. 1,499 ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ డేటా, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, అపరిమిత వాయిస్ కాల్స్ 180 రోజుల కాలపరిమితితో లభిస్తాయి. ఆఫర్‌లో భాగంగా 50 జీబీ డేటా లభిస్తుంది. రూ. 2,899 ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 1.5 జీబీ డేటా, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు 365 రోజుల కాలపరిమితితో లభిస్తాయి. అదనంగా 75 జీబీ డేటాను ఆఫర్ చేస్తోంది. ఇక, రూ.3,099 ప్లాన్ కాలపరిమితి కూడా 365 రోజులే. రోజుకు 2జీబీ డేటా, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, అపరిమిత వాయిస్ కాల్స్ లభిస్తాయి. ఈ ప్లాన్‌తోనూ అదనంగా 75జీబీ డేటా లభిస్తుంది. ప్రతి రోజు పెద్ద మొత్తంలో డేటా ఉపయోగించే వారికి ఈ ప్లాన్లు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. రూ.3,099 ప్లాన్‌లో డిస్లీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ ప్లాన్ ఏడాది పాటు లభిస్తుంది. అన్ని ప్లాన్లలోనూ కామన్‌గా వీఐ మూవీస్, టీవీ వీఐపీ యాక్సెస్ ఉచితంగా లభిస్తుంది.

Updated Date - 2022-10-29T16:50:16+05:30 IST