హైదరాబాద్‌లో వీఎల్‌ఎస్‌ఐ, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ సమావేశాలు

ABN , First Publish Date - 2022-12-02T03:01:30+05:30 IST

అంతర్జాతీయ వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ సమావేశాలు హైదరాబాద్‌లో జరగనున్నాయి...

హైదరాబాద్‌లో వీఎల్‌ఎస్‌ఐ, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ సమావేశాలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అంతర్జాతీయ వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ సమావేశాలు హైదరాబాద్‌లో జరగనున్నాయి. వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ సమావేశాలు 2023 జనవరి 8 నుంచి 12 వరకు జరుగుతాయని వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌ కాన్ఫరెన్స్‌ జనరల్‌ చైర్‌ సంజయ్‌ చురివాలా తెలిపారు. 2,000 మందికి పైగా ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరు కానున్నారు. మొదటిరోజు కార్యక్రమానికి కేంద్ర ఎలకా్ట్రనిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు హాజరు కానున్నారు.

Updated Date - 2022-12-02T03:01:33+05:30 IST