విస్తారా, ఎయిరిండియా విలీనంపై చర్చలు : ఎస్‌ఐఏ

ABN , First Publish Date - 2022-10-14T09:15:35+05:30 IST

టాటాల నిర్వహణలోని విస్తారా, ఎయిరిండియా విలీనంపై అత్యంత గోప్యంగా చర్చలు జరుపుతున్నట్టు సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ తెలిపింది.

విస్తారా, ఎయిరిండియా విలీనంపై చర్చలు : ఎస్‌ఐఏ

న్యూఢిల్లీ: టాటాల నిర్వహణలోని విస్తారా, ఎయిరిండియా విలీనంపై అత్యంత గోప్యంగా చర్చలు జరుపుతున్నట్టు సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ తెలిపింది. విస్తారాలో టాటాలకు 51 శాతం వాటాలుండగా సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు 49 శాతం వాటాలున్నాయి. ప్రస్తుతం టాటాలతో చర్చలు జరుపుతున్నామని, ఇంకా ఎలాంటి ఒప్పంందం కుదరలేదని సింగపూర్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీకి పంపిన సందేశంలో సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ తెలిపింది. 

Read more