విడా వీ1 డెలివరీ ప్రారంభం: హీరో మోటో
ABN , First Publish Date - 2022-12-31T03:17:08+05:30 IST
తమ తొలి ఎలక్ర్టిక్ స్కూటర్ విడా వీ1 కస్టమర్లకు అందించే ప్రక్రియ బెంగళూరులో ప్రారంభమైనట్టు హీరో మోటోకార్ప్ తెలిపింది.
న్యూఢిల్లీ: తమ తొలి ఎలక్ర్టిక్ స్కూటర్ విడా వీ1 కస్టమర్లకు అందించే ప్రక్రియ బెంగళూరులో ప్రారంభమైనట్టు హీరో మోటోకార్ప్ తెలిపింది. త్వరలోనే జైపూర్, ఢిల్లీ నగరాల్లో కూడా డెలివరీలు ప్రారం భించనున్నట్టు ప్రకటించింది. హీరోకి చెందిన తొలి విద్యుత్ స్కూటర్ విడాలో రెండు వేరియెంట్లున్నాయి. ఢిల్లీలో విడా వీ1 ఎక్స్‌షోరూమ్ ధర రూ.1,35,705 కాగా, విడా వీ1 ప్రో ధర రూ.1,46,880. ఈ స్కూటర్ గంటకి 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.