52 వారాల గరిష్టానికి ఉజ్జీవన్ ఫైనాన్స్.. 6 నెలల్లో 102% జూమ్ చేసిన స్టాక్

ABN , First Publish Date - 2022-08-24T18:39:48+05:30 IST

ఉజ్జీవన్ ఫైనాన్స్ షేర్లు నేడు దూసుకెళ్లాయి. బుధవారం ఇంట్రా-డేలో ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (UFSL) షేర్లు బీఎస్‌ఈలో 9 శాతం ర్యాలీ

52 వారాల గరిష్టానికి ఉజ్జీవన్ ఫైనాన్స్.. 6 నెలల్లో 102% జూమ్ చేసిన స్టాక్

Ujjivan Financial Shares : ఉజ్జీవన్ ఫైనాన్స్ షేర్లు నేడు దూసుకెళ్లాయి. బుధవారం ఇంట్రా-డేలో ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (UFSL) షేర్లు బీఎస్‌ఈలో 9 శాతం ర్యాలీ చేయడంతో 52 వారాల గరిష్టం రూ.200.65కి చేరాయి. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (NBFC) స్టాక్ నవంబర్ 1, 2021న దాని మునుపటి గరిష్ట స్థాయి రూ. 191.80ని అధిగమించింది. కౌంటర్లో ట్రేడింగ్ వాల్యూమ్‌లు తమ రెండు వారాల సగటు ట్రేడింగ్ వాల్యూమ్‌ల కంటే దాదాపు రెట్టింపు అయ్యాయి. 


గత ఆరు నెలల్లో ఉజ్జీవన్ ఫైనాన్షియల్ మార్కెట్ ధర(Market price) 102 శాతం పెరిగింది. ఎస్అండ్‌పీ బీఎస్ఈ సెన్సెక్స్(S&P BSE Sensex)లో 8 శాతం పెరిగింది. ఈ స్టాక్ జూలై 28, 2016న రికార్డు గరిష్టం రూ.547కు చేరింది. యూఎఫ్ఎస్ఎల్ అనేది ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్‌(Ujjivan Small Finance Bank Limited)కు చెందిన ప్రధాన హోల్డింగ్ కంపెనీ. ఇది 83.32 శాతం వాటాను కలిగి ఉంది. 


బ్యాంకింగ్ లైసెన్స్(Banking Licence) ఆవశ్యకత కోసం UFSL తన పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థను ఫిబ్రవరి 1, 2017 నుండి ప్రారంభించింది. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది భారతదేశం(India)లో భారీ మార్కెట్ కేంద్రీకృతమైన బ్యాంక్. ఆర్థికంగా సేవలందించని లేదంటే తక్కువ సేవలందించే విభాగాలను కలిగి ఉంది. 

Read more