Sprite: సరికొత్త క్యాంపెయిన్‌ను ప్రారంభించిన స్ప్రైట్

ABN , First Publish Date - 2022-08-23T03:15:38+05:30 IST

సాఫ్ట్ డ్రింక్ స్ప్రైట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిమ్మరుచితో అదరగొట్టే ఈ శీతల పానీయం చాలామందికి

Sprite: సరికొత్త క్యాంపెయిన్‌ను ప్రారంభించిన స్ప్రైట్

హైదరాబాద్: సాఫ్ట్ డ్రింక్ స్ప్రైట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిమ్మరుచితో అదరగొట్టే ఈ శీతల పానీయం చాలామందికి ఫేవరెట్ డ్రింక్. ఇంకా చెప్పాలంటే ప్రతి ముగ్గురి ఒకరు దీనినే ఇష్టపడతారు. ఇప్పుడిది మరో సరికొత్త క్యాంపెయిన్ ప్రారంభించింది. ఇందుకోసం ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్ ‘ఆహా’తో ఒప్పందం కుదుర్చుకుంది. టాలీవుడ్ ప్రముఖ నటుడు నాని ఈ ప్రచార వీడియోలో నటించాడు. ఈ సరికొత్త క్యాంపెయిన్‌పై కోకా కోలా INSWA, స్పార్క్లింగ్ ఫ్లేవర్స్ కేటగరీ సీనియర్ డైరెక్టర్ టిష్ కాండెనో మాట్లాడుతూ.. స్ప్రైట్ రెండు దశాబ్దాలకు పైగా యువత బ్రాండ్‌గా పేరు పొందిందని అన్నారు. ‘తాజాదనం కలిగించే పానీయం తీసుకోండి.. అది అప్పటికప్పుడే మీ భావనను తేలికపరుస్తుంది’  అనే సందేశాన్ని ఈ క్యాంపెయిన్ పంపుతుందన్నారు.


ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న నానితో భాగస్వామ్యం కుదుర్చుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. వినయోగదారులతో తాము అనుసంధానమయ్యేందుకు ఇది తమకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. నాని మాట్లాడుతూ.. స్ప్రైట్ లాంటి చల్లబరిచే పానీయం మరోటి లేదని అన్నాడు. తీరికలేని షెడ్యూల్స్‌తో సతమతమైన సమయంలోనూ స్ప్రైట్‌నే ఎంచుకుంటానని పేర్కొన్నాడు. బ్రాండ్ కొత్త క్యాంపెయిన్‌లో భాగమైనందుకు ఆనందంగా ఉందన్నాడు. 

Updated Date - 2022-08-23T03:15:38+05:30 IST