Tide: వాషింగ్ మెషీన్ల కోసం.. మ్యాటిక్ లిక్విడ్ డిటర్జెంట్‌ను విడుదల చేసిన టైడ్
ABN , First Publish Date - 2022-11-27T20:13:59+05:30 IST
టాప్, ఫ్రంట్‌లోడ్ వాషింగ్ మెషీన్ల కోసం ప్రముఖ డిటర్జెంట్ మాన్యుఫ్యాక్చర్ టైడ్ (Tide) సరికొత్త మ్యాటిక్ లిక్విడ్ (Matic Liquid)ను
న్యూఢిల్లీ: టాప్, ఫ్రంట్‌లోడ్ వాషింగ్ మెషీన్ల కోసం ప్రముఖ డిటర్జెంట్ మాన్యుఫ్యాక్చర్ టైడ్ (Tide) సరికొత్త మ్యాటిక్ లిక్విడ్ (Matic Liquid)ను తీసుకొచ్చింది. ఇందులోని సుపీరియర్ లిఫ్ట్ అండ్ లాక్ టెక్నాలజీ అత్యంత కఠినమైన మరకలను కూడా తొలగిస్తుందని కంపెనీ పేర్కొంది. అదే సమయంలో వస్త్రాల రంగుకు ఏమాత్రం హాని జరగదని భరోసా ఇచ్చింది. టైడ్ మ్యాటిక్ లిక్విడ్ జోడింపుతో టైడ్ పోర్ట్‌ఫోలియో ఉత్పత్తులలో విస్తృత శ్రేణి డిటర్జెంట్లు చేరాయి. వీటిలో పౌడర్లు, పాడ్స్ కూడా ఉన్నాయి.
వస్త్రాలను తరచుగా ఉతకడం వల్ల రంగు పోవడంతో పాటు తెల్లటి వస్త్రాల రంగు మారుతుందని చాలామంది ఆందోళన చెందుతూ ఉంటారు. దీంతో మరకలను తొలగించేందుకు గృహ చిట్కాలు వాడుతుంటారు. అయితే, ఇలాంటి వాటికి తమ టైడ్ మ్యాటిక్ లిక్విడ్ (Matic Liquid) పరిష్కారం చూపుతుందని కంపెనీ పేర్కొంది. ఈ సందర్భంగా పీఅండ్‌జీ ఇండియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, వైస్ ప్రెసిడెంట్ (ఫ్యాబ్రిక్ కేర్) శరత్ వర్మ మాట్లాడుతూ.. అసాధారణ క్లీనింగ్, ఆహ్లాదకరమైన లాండ్రీ అనుభవాలను విభిన్నమైన వాష్ కండిషన్స్, గార్మెంట్స్ వ్యాప్తంగా అందించాలని టైడ్ కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. ప్రపంచంలోనే నంబర్ 1 డిటర్జెంట్ బ్రాండ్ అయిన టైడ్ నుంచి వచ్చిన తాజా మ్యాటిక్ లిక్విడ్ రంగులు పోకుండానే కఠినమైన మరకలను తొలగించేలా తీర్చిదిద్దినట్టు చెప్పారు.