బ్యాంకింగ్ రంగంపై... బడ్జెట్లో... అతిపెద్ద ప్రకటన..!
ABN , First Publish Date - 2022-01-17T23:58:56+05:30 IST
మరికొద్ది రోజుల్లో రాబోతున్న ‘బడ్జెట్ 2022’కు సంబంధించిన సన్నాహాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ దఫా బడ్జెట్లో బ్యాంకింగ్ రంగం కోసం నిర్మలా సీతారామన్ అతిపెద్ద ప్రకటన చేయబోతున్నట్లుగా వినవస్తోంది.

న్యూఢిల్లీ : మరికొద్ది రోజుల్లో రాబోతున్న ‘బడ్జెట్ 2022’కు సంబంధించిన సన్నాహాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ దఫా బడ్జెట్లో బ్యాంకింగ్ రంగం కోసం నిర్మలా సీతారామన్ అతిపెద్ద ప్రకటన చేయబోతున్నట్లుగా వినవస్తోంది. ప్రభుత్వం ఈ బడ్జెట్లో జన్ ధన్ యోజన మూడో దశను ప్రారంభించనుంది. ఇక... ఈ బడ్జెట్లో బ్యాంకింగ్ రంగం కోసం కేంద్రం అతిపెద్ద ప్రకటన చేయబోతున్నట్లు వినవస్తోంది. ప్రభుత్వం ఈ బడ్జెట్లో జన్‌ధన్ యోజన మూడో దశను ప్రారంభించబోతున్నారు.
దీని కింద, జన్‌ధన్ ఖాతాదారులు కూడా డిజిటల్ బ్యాంకింగ్ సేవలను పొందనున్నారు. అంతేకాకుండా... ఈ ఖాతాదారులకు కూడా ‘ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలు’ అందుబాటులోకి రానున్నాయి. డిజిటల్ బ్యాంకింగ్ సేవలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత... జన్‌ధన్ ఖాతాదారులు కూడా తొలిసారి మొబైల్ ఫోన్ల నుంచి ఈ సేవల ప్రయోజనాలను పొందుతున్న విషయం తెలిసిందే. అటల్ పెన్షన్ యోజన, సుకన్య సమృద్ధి యోజన తదితర పథకాలను జన్‌ధన్ ఖాతాలకు అనుసంధానించిన విషయం తెలిసిందే. అంటే ఈ పథకం కింద డిపాజిట్ చేసే నగడును నేరుగా జన్‌ధన్ ఖాతాలకే జమచేస్తున్నారు. ఈ క్రమంలో... ఈ పథకాల ప్రయోజనాలు పెరుగుతున్నట్లు చెబుతున్నారు.
జన్‌ధన్ ఖాతాలు... 44 కోట్లకు పైగానే...
జన్‌ధన్ కింద 44.33 కోట్ల ఖాతాలను తెరిచారు. ఈ ఖాతాలను ఎక్కువగా ప్రభుత్వరంగ బ్యాంకుల్లోనే తెరిచారు. రూ. 1,54,916 కోట్లు ఈ బ్యాంకు జమ అయ్యాయి.