ప్రధాన నిరోధం 16000
ABN , First Publish Date - 2022-06-27T09:40:33+05:30 IST
నిఫ్టీ గత వారం పాజిటివ్‌గా ప్రారంభమైనా మైనర్ రియాక్షన్లో పడింది, కాని మద్దతు స్థాయిల్లో బ్రేక్‌డౌన్ లేకుండా మైనర్ అప్‌ట్రెండ్ కొనసాగించి చివరికి 15700 వద్ద పటిష్ఠంగా ముగిసింది.

సోమవారం స్థాయిలు
నిరోధం : 15920, 16000
మద్దతు : 15800, 15740
నిఫ్టీ గత వారం పాజిటివ్‌గా ప్రారంభమైనా మైనర్ రియాక్షన్లో పడింది, కాని మద్దతు స్థాయిల్లో బ్రేక్‌డౌన్ లేకుండా మైనర్ అప్‌ట్రెండ్ కొనసాగించి చివరికి 15700 వద్ద పటిష్ఠంగా ముగిసింది. గతంలో 16800 స్థాయి నుంచి ఏర్పడిన డౌన్‌ట్రెండ్ అనంతరం టెక్నికల్‌గా ఏర్పడిన స్వల్పకాలిక రికవరీ ఇది. ప్రధాన మద్దతు స్థాయి 15000 వద్ద రికవరీ ద్వారా తక్షణ డౌన్‌ట్రెండ్‌ను నివారించుకుంది. కాని స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌లో ఇంకా ప్రవేశించాల్సి ఉంది. అలాగే దిగువ స్థాయిల్లో ఎలాంటి కన్సాలిడేషన్ లేకుండా జరిగిన బౌన్స్బ్యాక్గా కూడా దీన్ని భావించాలి. మార్కెట్ ఇంకా తొలి అవరోధాన్ని కూడా ఛేదించలేదు. ఇప్పుడు గరిష్ఠ స్థాయిల్లో కన్సాలిడేషన్‌కు ఆస్కారం ఉంది. అమెరికన్ మార్కెట్లో బుల్లిష్ ధోరణి కారణంగా ఈ వారం పాజిటివ్‌గానే ప్రారంభం కావచ్చు. 16000 వద్ద మరో పరీక్ష ఎదుర్కొనే ఆస్కారం ఉంది.
బుల్లిష్ స్థాయిలు: తదుపరి దిశ తీసుకునే ముందు స్వల్పకాలిక నిరోధం 16000 వద్ద కన్సాలిడేషన్ సాధించవచ్చు. ఆ పైన మాత్రమే స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌కు ఆస్కారం ఉంది. ప్రధాన నిరోధ స్థాయిలు 16250, 16550.
బేరిష్ స్థాయిలు: దిగువన 15800 వద్ద మద్దతు ఉంది. రియాక్షన్‌కు గురైనా సానుకూలత కోసం ఇక్కడ నిలదొక్కుకుని తీరాలి. విఫలమైతే బలహీనపడే ఆస్కారం ఉంది. ప్రధాన మద్దతు స్థాయి 15500. అంతకన్నా దిగజారితే స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తం కావాలి.
బ్యాంక్ నిఫ్టీ : ఈ సూచీ కూడా గత వారంలో బలమైన రికవరీ సాధించి 885 పాయింట్ల లాభంతో 33630 వద్ద ముగిసింది. స్వల్పకాలిక నిరోధం 34100. ఆ పైన మాత్రమే మరింత అప్‌ట్రెండ్ ఉంటుంది. రియాక్షన్లో పడితే 33500 వద్ద మద్దతు ఉంది.
పాటర్న్ : గత వారం నిఫ్టీ ఓవర్‌సోల్డ్ సితి నుంచి కోలుకుంది. మార్కెట్ ఇప్పటికీ స్వల్పకాలిక చలన సగటు సూచీ కన్నా దిగువనే ఉంది. ప్రస్తుతం 16000 వద్ద ‘‘అడ్డంగా కనిపిస్తున్న సపోర్ట్ ట్రెండ్‌లైన్’’కు సమీపంలోకి వస్తోంది. ట్రెండ్‌లో సానుకూలత కోసం ఇక్కడ కన్సాలిడేషన్ తప్పనిసరి.
టైమ్ : ఈ సూచీ ప్రకారం బుధవారం మైనర్ రివర్సల్ ఉండవచ్చు.