మూడు కంపెనీల ఎంక్యాప్... రూ. 1.75 లక్షల కోట్లు పెరిగింది

ABN , First Publish Date - 2022-05-23T02:08:04+05:30 IST

మూడు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ కిందటి వారం రూ. 1.75 లక్షల కోట్లు పెరిగింది.

మూడు కంపెనీల ఎంక్యాప్...   రూ. 1.75 లక్షల కోట్లు పెరిగింది

ముంబై : మూడు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ కిందటి వారం రూ. 1.75 లక్షల కోట్లు పెరిగింది. కాగా... వీటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎంక్యాప్ భారీగా పెరగడం విశేషం. గతవారం reliance industries, HDFC bank, hindusthan uniliver కంపెనీల మార్కెట్ క్యాప్ పెరిగింది. టాప్ 5లోని TCS, Infosys కంపెనీల మార్కెట్ క్యాప్ తగ్గడం గమనార్హం. reliance industries మార్కెట్క్యాప్ రూ. 1,31,320.9 కోట్లు పెరిగి, రూ. 17,73,889.79 కోట్లకు, HUL ఎంక్యాప్ రూ. 30,814.90  కోట్లు పెరిగి, రూ.5,46,397.45 కోట్లకు, HDFC బ్యాంకు ఎంక్యాప్  రూ. 16,515.02 కోట్లు పెరిగి, రూ.7,33,156.15 కోట్లకు చేరుకున్నాయి. ఇదే సమయంలో టీసీఎస్ ఎంక్యాప్ రూ. 43,743.97 కోట్లు తగ్గి, రూ. 12,05,254.93 కోట్లకు, ఇన్ఫోసిస్ ఎంక్యాప్ రూ. 20,129.66 కోట్లు క్షీణించి రూ. 6,12,303.25 కోట్లకు చేరుకోవడం గమనార్హం.

Updated Date - 2022-05-23T02:08:04+05:30 IST