ఇంటి బడ్జెట్‌ మరింత భారం

ABN , First Publish Date - 2022-07-17T08:53:53+05:30 IST

ధరాభారంతో సామాన్యుడు చితికి పోతున్నాడు.

ఇంటి బడ్జెట్‌ మరింత భారం

రేపటి నుంచి పలు ఉత్పత్తులపై జీఎ్‌సటీ పన్ను పోటు 

జాబితాలో చెంచాలు, షార్ప్‌నర్స్‌, చెక్‌బుక్స్‌ సహా మరికొన్ని వస్తువులు


12% పన్ను పరిధిలోఉండే వస్తు, సేవలు 

సోలార్‌ వాటర్‌ హీటర్లు, యంత్రాలు

అన్ని రకాల తోలు (లెదర్‌) వస్తువులు

అన్ని రకాల ప్రింటెడ్‌ మ్యాపులు, చార్టులు

రోజువారీ అద్దె రూ.1,000 వరకు ఉండే హోటల్‌ రూమ్‌లు

ప్రభుత్వ స్థలాల్లో మట్టిపని, సబ్‌ కాంట్రాక్టులకు సంబంధించిన వర్క్‌ కాంట్రాక్టులు    


18% పన్ను పరిధిలోని వస్తువులు  

ఎల్‌ఈడీ బల్బులు, సిరా, చాకులు, బ్లేడ్లు, పెన్సిల్‌ షార్ప్‌నర్లు, బ్లేడ్లు, స్పూన్లు, ఫోర్కులు, గరిటెలు, స్కిమ్మర్లు, కేక్‌ సర్వర్లు

ప్రింటింగ్‌, రైటింగ్‌, డ్రాయింగ్‌ కోసం ఉపయోగించే ఇంక్‌, ఫిక్సర్‌, మెటల్‌ ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డులు

విద్యుత్‌, సైకిళ్లతో నడిచే పంపులు, పాడి పరిశ్రమ కోసం ఉపయోగించే యంత్ర పరికరాలు

విత్తనాలు, ఆహార ధాన్యాలు, పప్పుల క్లీనింగ్‌, సార్టింగ్‌, విత్తనాల గ్రేడింగ్‌ యంత్రాలు

చిరు ధాన్యాల మిల్లింగ్‌ కోసం ఉపయోగించే యంత్ర పరికరాలు

వెట్‌ గ్రైండర్లు, ఎయిర్‌ బేస్డ్‌ ఆటా చక్కి, చెక్‌ బుక్‌లు

రోడ్లు, వంతెనలు, రైల్వే, మెట్రో, మురుగు నీటి శుద్ధి  ప్లాంట్లు, స్మశానాల నిర్మాణ పనుల వర్క్‌ కాంట్రాక్టులు

కేంద్ర-రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల నిర్వహణలోని చారిత్రక ప్రాధాన్యత ఉన్న కట్టడాలు, కాలువలు, ఆనకట్టలు, పైప్‌లైన్లు, నీటి సరఫరా ప్లాంట్లు, విద్యా సంస్థలు, ఆస్పత్రులకు సంబంధించిన వర్క్‌ కాంట్రాక్టులు


5% జీఎ్‌సటీ పరిధిలో

ఐసీయూ మినహా రోజువారీ అద్దె రూ.5,000 పైన ఉండే ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) వర్తించని  హాస్పిటల్‌  రూమ్‌లు

ప్రీ ప్యాకేజ్డ్‌ లేదా లేబుల్డ్‌ బియ్యం, గోధుమ పిండి, బటర్‌ మిల్క్‌, పెరుగు, లస్సీ, పన్నీర్‌


 సోమవారం నుంచి సామాన్యుడి హోమ్‌ బడ్జెట్‌ మరింత భారం కానుంది. అనేక గృహోపయోగ వస్తువులు, హోటళ్లలో రూమ్‌ బుకింగ్‌, బ్యాంకింగ్‌ సేవలపై జీఎ స్‌టీ భారం మరింత పెరగనుంది. గత నెల చండీగఢ్‌లో జరిగిన జీ ఎస్‌టీ కమిటీ సమావేశం ఇందుకు ఆమోదముద్ర వేసింది. ఇప్పటి వరకు పన్ను మినహాయింపు ఉన్న అనేక వస్తువులను జీఎ్‌సటీ పరిధిలోకి తీసుకురావటంతో పాటు కొన్ని వస్తువులపై జీఎ్‌సటీ మరింత పెంచేందుకూ ఈ సమావేశం ఆమోదం తెలిపింది. సవరించిన కొత్త జీఎ్‌సటీ రేట్లు సోమవారం నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. దీంతో కొన్ని వస్తు, సేవలు మరింత భారం కానున్నాయి. 


సగటు జీవిపై ధరల పిడుగు

ఏడాదిలో 32% భారం

ధరాభారంతో సామాన్యుడు చితికి పోతున్నాడు. గత ఏడాది కాలంలో మసాల దినుసులు, సబ్బులు, బియ్యం మొదలుకుని అనేక వినియోగ వస్తువుల ధరలు సగటున 32 శాతం పెరిగాయి. ఏడాది క్రితం మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉపయోగించే సన్న బియ్యం కిలో రూ.40-41 మధ్య లభించేది. ఇప్పుడదే  బియ్యం కిలో రూ.48 నుంచి రూ.50 పలుకుతోంది. బిజోమ్‌ అనే రిటైల్‌ ఇంటలిజెన్స్‌ సంస్థ ఒక నివేదికలో ఈ విషయం వెల్లడించింది. గత ఏడాది జూన్‌తో పోలిస్తే ఈ ఏడాది జూన్‌లో కొత్తిమీర కట్ట 16.9 శాతం, గరం మసాలా ప్యాకెట్ల ధర 15.6 శాతం పెరిగాయి. బ్రాండెడ్‌ పాలు, బ్రెడ్‌ల ధరలూ గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జూన్‌లో 5.4 నుంచి 12.3 శాతం పెరిగాయి. ఇదే సమయంలో బ్రాండెడ్‌ సబ్బులు, ఫ్లోర్‌ క్లీనర్లు, డిటర్జెంట్ల ధరలూ 9.7 శాతం నుంచి 15 శాతం వరకు కొండెక్కాయి. బ్రాండెడ్‌ బాస్మతి బియ్యం ధర 32 శాతం పెరిగింది. ఇదే సమయంలో వెన్న, నెయ్యి ధరలూ 5.3 శాతం నుంచి 7.7 శాతం పెరిగాయి.

Read more