టీసీఎస్... రూ. 18 వేల కోట్ల బైబ్యాక్...

ABN , First Publish Date - 2022-03-23T00:13:03+05:30 IST

టాటా గ్రూప్ ఫ్లాగ్‌షిప్ సంస్థ 40 మిలియన్ల షేర్లను, లేదా... 1.08 % ఈక్విటీని... రూ. 4,500 చొప్పున తిరిగి కొనుగోలు చేస్తోందన్న విషయం తెలిసిందే.

టీసీఎస్... రూ. 18 వేల కోట్ల బైబ్యాక్...

 ముంబై : టాటా గ్రూప్ ఫ్లాగ్‌షిప్ సంస్థ 40 మిలియన్ల షేర్లను,  లేదా... 1.08 % ఈక్విటీని... రూ. 4,500 చొప్పున తిరిగి కొనుగోలు చేస్తోందన్న విషయం తెలిసిందే. భారత్ రెండవ అత్యంత విలువైన సంస్థ... టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్...  రూ. 18 వేల కోట్ల షేర్ బైబ్యాక్ కార్యక్రమం పెద్ద సంఖ్యలో వాటాదారులను ఆకర్షించింది. ఈ రోజు(మంగళవారం)... 220 మిలియన్ షేర్లు టెండరయ్యాయి. కంపెనీ తిరిగి కొనుగోలు చేయాలని భావిస్తున్న దానికంటే ఇది 5.5 రెట్లు అధికం. టాటా గ్రూప్ ఫ్లాగ్‌షిప్ సంస్థ 40 మిలియన్ షేర్లను, లేదా... దాని ఈక్విటీలో 1.08 శాతాన్ని తిరిగి కొనుగోలు చేస్తోంది. షేరుకు రూ. 4,500 చొప్పున బైబ్యాక్ జరగనుంది. షేరు చివరిగా రూ. 3,701 వద్ద ముగిసింది. మార్చి 9 న ప్రారంభమైన టెండర్ రూట్ బైబ్యాక్ రేపటి(బుధవారం)తో ముగియనుంది. 


ఎడెల్వీస్ ఆల్టర్నేటివ్ రీసెర్చ్ విశ్లేషణ ప్రకారం...  రిటైల్ ఇన్వెస్టర్ల అంగీకార నిష్పత్తి 14.3 శాతంగా ఉండవచ్చునని భావిస్తున్నారు. మరో మాటలో చెప్పాలంటే... టెండర్ చేసిన ప్రతి 7 షేర్లకు బైబ్యాక్‌లో ఒక షేరు చొప్పున ఆమోదించనున్నారు. నాన్-రిటైల్ ఇన్వెస్టర్ల కోసం, టెండర్ చేసిన ప్రతి 108 షేర్లకు ఒక షేర్‌ను  మాత్రమే ఆమోదించనున్నారు. టీసీఎస్ చేసిన మునుపటి బైబ్యాక్‌ల కంటే అంగీకార నిష్పత్తి తక్కువగా ఉడడం గమనార్హం. గతంలో... అంటే... 2020 లో... టీసీఎస్ రూ. 16 వేల కోట్ల బైబ్యాక్ చేసింది. ఇక్కడ అంగీకార నిష్పత్తి రిటైల్‌కు 100 శాతం కాగా, రిటైలేతర పెట్టుబడిదారులకు 10 శాతంగా ఉంది. 

Updated Date - 2022-03-23T00:13:03+05:30 IST